For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సోషల్‌ మీడియాలో వైరల్‌: రోహిత్‌ లేకుండా టీమిండియా ఫొటో.. అభిమానుల ఆగ్రహం

Virat Kohli Posts 'Squad' Picture, Fans Ask Where's Rohit Sharma..?? || Oneindia Telugu
Kohli-Rohit Rift: Virat Kohli Posts Squad Picture, Fans Ask Wheres Rohit Sharma?

హైదరాబాద్: సోషల్‌ మీడియాలో ప్రస్తుతం రోహిత్‌ శర్మ ఎక్కడ? అనే ప్రశ్నలు వైరల్ అయ్యాయి. అభిమానులు ఈ ప్రశ్నలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంధిస్తున్నారు. తాజాగా ఓపెనర్ రోహిత్‌ శర్మ లేని టీమిండియా ఆటగాళ్లతో దిగిన ఓ ఫొటోను విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో.. రోహిత్‌ ఎక్కడ? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కోహ్లీ, రోహిత్‌ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

కెప్టెన్సీ కాపాడుకోవడానికే:

కెప్టెన్సీ కాపాడుకోవడానికే:

ప్రపంచకప్‌-2019 సెమీస్ నుండి భారత్ నిష్క్రమించడంతో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. కోహ్లీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు అప్పగించాలనే డిమాండ్‌ వ్యక్తం అయింది. విండీస్ పర్యటన నేపథ్యంలో పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించాలని సెలెక్టర్లపై ఒత్తిడి వచ్చింది. కెప్టెన్సీ కాపాడుకోవడానికే కోహ్లీ వెస్టిండీస్‌ పర్యటకు విశ్రాంతి తీసుకోలేదని కూడా పుకార్లు వచ్చాయి.

విభేదాలు లేవు:

తాజాగా కోహ్లీ భార్య అనుష్క శర్మను ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ అన్‌ఫాలో చేయడంతో ఈ వార్తలు నిజమే అని అందరూ అనుకున్నారు. అయితే విండీస్ పర్యటనకు వెళ్లే ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ... 'రోహిత్‌కు నాకు మధ్య విభేదాలు పూర్తిగా నిరాధారం. అనవసరంగా వ్యక్తిగత జీవితాలను వివాదాల్లోకి లాగుతున్నారు. బయట ఉన్నవాళ్లు లేని వార్తలు పుట్టిస్తుంటే అసహ్యమేస్తోంది' అని స్పష్టం చేసాడు.

రోహిత్‌ లేకుండా టీమిండియా ఫొటో:

రోహిత్‌ లేకుండా టీమిండియా ఫొటో:

కోహ్లీ వివరణ ఇచ్చినా.. కోహ్లీ-రోహిత్ సామాజిక మాధ్యమాల్లో ప్రవర్తిస్తున్న తీరు అభిమానులను అనేక ప్రశ్నలు ఆలోచించేలా చేస్తోంది. విషయం సద్దుమణిగిందనుకుంటుండగా.. రోహిత్ శర్మ బుధవారం ఓ ట్వీట్ చేసాడు. 'జట్టు కోసం మాత్రమే కాదు.. దేశం కోసం బరిలోకి దిగుతా' అని రాసుకొచ్చాడు. రోహిత్ ఈ ట్వీట్ చేయడంతో చర్చనీయాంశమైంది. తాజాగా రోహిత్‌ లేకుండా టీమిండియా ఫొటోను కోహ్లీ పోస్ట్ చేయడంతో వీరి మధ్య గొడవలు ఉన్నాయనే అనుమానాల్ని కలిగిస్తోంది.

Story first published: Friday, August 2, 2019, 14:37 [IST]
Other articles published on Aug 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+