For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అయ్యా సామి.. ట్రోఫీని మర్చిపోవడం ఏంది!'- కోహ్లీ,రోహిత్,రాహుల్ (వీడియో వైరల్)

ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఫుల్ జోల్ ఉంది టీమిండియా. రీసెంట్ గా ఇంగ్లాండ్ పై టీ20, వన్డే సిరీస్ దక్కించుకుని విజయోత్సాహంలో ఉంది. అయితే మూడో మ్యాచ్ తర్వాత సొంతం చేసుకున్న వన్డే సిరీస్ ట్రోఫీని కోహ్లీ, రోహిత్, రాహుల్ మైదానంలోనే మర్చిపోయి నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్‌పై టీమిండియా 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 3-0 తేడాతో సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో మరోసారి భారత్ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి సిరీస్ ను దక్కించుకుంది. దీంతో మూడో మ్యాచ్ ముగియగానే భారత జట్టులో సంబరాలు మొదలయ్యాయి. మైదానంలో ఆటగాళ్లంతా కలిసి సరదాగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

kohli Rohit kLRahul forgot the ODI series trophy funny video goes viral in ind vs eng 3rd ODI

అయితే ఈ గెలుపు జోష్ లో ఉన్న టీమిండియాలో ఓ అనుకోని ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. మైదానంలో సరదాగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్లిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. తమ పక్కనే ఉన్న వన్డే సిరీస్ ట్రోఫీని మర్చిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో కోహ్లీ, రోహిత్, రాహుల్ నడుచుకుంటూ.. తమకు కాస్త పక్కకు ఉన్న ట్రోఫీని మరిచి దానిని పట్టించుకోకుండా దాటేసి వెళ్లిపోవడం కనిపించింది. ఆ తర్వాత నాలుగు అడుగులు ముందుకు వేశాక.. సడెన్ గా ట్రోఫీ గుర్తుకువచ్చి రాహుల్, రోహిత్ వెనక్కి వెళ్లి తీసుకున్నారు. ఈ వీడియో షేర్ చేసిన ఓ నెటిజన్.. ముగ్గురికి ముగ్గురు పిచ్చోళ్లు.. ఏకంగా ట్రోఫీనే మర్చిపోయారు అంటూ ఫన్నీగా కామెంట్ పెట్టాడు.

Story first published: Friday, February 14, 2025, 16:31 [IST]
Other articles published on Feb 14, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+