Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గిల్ తండ్రితో పంత్ డ్యాన్స్ - ఆ ముగ్గురితో అనుష్క శర్మ విన్నింగ్ హగ్ (వీడియో వైరల్)

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఆటగాళ్లు కూడా మైదానంలో విజయోత్సాహంలో ముగిపోయారు. తమ కుటుంబసభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మైదానంలో కొన్ని హార్ట్ టచింగ్ మూమెంట్స్ కనిపించాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పంత్ తో కలిసి భాంగ్రా డ్యాన్స్
శుభ్‌మన్‌ గిల్‌ తండ్రి.. తన కుమారుడు ఐసీసీ ట్రోఫీని గెలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వికెట్ కీపర్ పంత్ తో కలిసి భాంగ్రా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత అర్షదీప్ సింగ్, గిల్, పంత్, గిల్ తండ్రి కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.

kohli rohit anushka winning hug and gill father pant dance after india won champions trophy 2025

అనుష్క శర్మ విన్నింగ్ హగ్..
టీమిండియా విజయంలో కీలకంగా వ్యవహరించిన కెప్టెన్ రోహిత్ శర్మకు, కోహ్లీ భార్య అనుష్కశర్మ విన్నింగ్‌ హగ్‌ ఇచ్చింది. ఆప్యాయంగా హత్తుకొని మరీ అభినందించింది. మైదానంలో రోహిత్ తన కుమార్తెను ముద్దు చేసోన్న సమయంలో అతడి ప్రత్యేకంగా పిలిచి మరీ కంగ్రాట్స్‌ చెబుతూ హత్తుకుంది. అలానే హార్దిక్ పాండ్యకు కూడా హగ్ ఇచ్చింది.

పరుగెత్తుకుంటూ వచ్చి మరీ..
అంతకన్నా ముందు తన భార్త విరాట్ కోహ్లీని ఆనందంతో హత్తుకుంది అనుష్క శర్మ. మ్యాచ్‌ గెలిచిన తర్వాత స్టాండ్‌లో ఉన్న అనుష్క శర్మ దగ్గరకు కోహ్లీ పరిగెడుతూ వెళ్లి మరీ ఎమోషనల్‌ హగ్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ అవుతున్నాయి. రవీంద్ర జడేజా తన భార్య, కుమార్తెతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. శ్రేయస్ అయ్యర్ మైదానంలో తన తల్లిని హత్తుకుని ముద్దులు పెట్టాడు.

Story first published: Monday, March 10, 2025, 10:22 [IST]
Other articles published on Mar 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+