స్పెషల్ మ్యాచ్ ముందు భావోద్వేగ ట్వీట్‌తో ధోనీని గుర్తుచేసుకున్న కోహ్లీ..! ధోనీ హయాంలోనే బాగుందంటూ..

విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని మధ్య సన్నిహిత సంబంధాలుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. టీమిండియాలో ధోనీ కెప్టెన్‌గా, విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్‌గా ఉన్న టైంలో.. కోహ్లీ టాపార్డర్లో చెలరేగుతుంటే.. ధోనీ చివర్లో ఫినిషింగ్ పని చూసుకునేవాడు. వీరిద్దరు చాలా మ్యాచ్‌లలో కలిసి బ్యాటింగ్ చేసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పడంతో పాటు.. పలు చిరస్మరణీయ మ్యాచ్‌లను గెలిపించారు. ప్రస్తుతం ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నా విరాట్ కోహ్లీ సైతం కెప్టెన్సీ నుంచి వైదొలిగి ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. రిటైర్మెంట్ అయ్యాక కూడా ధోనీ, కోహ్లీ మధ్య బంధం ఎప్పటిలాగే దృఢంగా ఉంది. ఇకపోతే ఆసియా కప్ 2022లో భారతదేశం vs పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు.. కోహ్లీ ధోనీకి హృదయపూర్వకంగా ట్రిబ్యూట్ ఇచ్చాడు. తన ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా ధోనీతో కలిసి ఉన్న చిత్రాన్ని కోహ్లీ పోస్ట్ చేశాడు. ఇది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. అసలు ఈ టైంలో ధోనీని కోహ్లీ ఎందుకు గుర్తుకు చేసుకున్నాడు.. ఇంతకీ కారణమేంటో తెలుసుకుందాం.
అందుకే ధోనీని గుర్తుచేసుకుంటూ
విరాట్ కోహ్లీ ధోనీ హయాంలోనే అత్యుత్తమ క్రికెట్ కెరీర్ కలిగి ఉన్నాడు. అతను ధోనీ నుంచి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని అందుకున్నాడు. అంతకుముందు ధోనీకి డిప్యూటీగా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇకపోతే ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కోహ్లీకి 100వ ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్. తాను ఇంత సుదీర్ఘకాలంగా టీ20 క్రికెట్లో రాణిస్తున్నాడంటే కారణాల్లో ధోనీ ఒకడు. కోహ్లీ కెరీర్ గాడిలో పడేవరకు ధోనీ చాలా సందర్భాల్లో అతనికి బ్యాక్ నుంచి సపోర్ట్ ఇచ్చాడు. భారత వైస్ కెప్టెన్‌గా కోహ్లీ ధోనీ కెప్టెన్సీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. తన కెరీర్లో చెప్పుకోదగ్గ రికార్డులను కోహ్లీ వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పుడే అందుకున్నాడు. ఇక కెప్టెన్సీ కోహ్లీకి అప్పగించాక కూడా ధోనీ ఓ ప్లేయర్‌లాగా జట్టులో ఉండి కొన్ని మ్యాచ్‌లు కోహ్లీకి గైడ్ చేశాడు.

ధోనీ హయాంలో నా కెరీర్ ఆనందదాయకం
'ధోనీ కెప్టెన్సీలో నమ్మదగ్గ వైస్ కెప్టెన్‌గా ఉండటం నా కెరీర్‌లో అత్యంత ఆనందదాయకమైన, ఉత్తేజకరమైన కాలం. మా ఇద్దరి పార్ట్‌నర్ షిప్‌లు ఎంతో ప్రత్యేకంగా నాకు గుర్తూనే ఉంటాయి. 7+18' కోహ్లీ క్యాప్షన్ ఇచ్చాడు. ఆగస్టు 25న ఈ పోస్ట్ చేశాడు. 7 అంటే ధోనీ జెర్సీ నంబర్, 18 కోహ్లీది. ఆగస్టు 25న ఈ ట్వీట్ చేశాడు. 7 +18 = 25. 2014లో టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు కోహ్లీ అన్ని ఫార్మాట్లలో చాలా కాలం పాటు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత 2017లో అతను మూడు ఫార్మాట్లలో కెప్టెన్ అయ్యాడు. ఇక తన వందో మ్యాచ్ ముందు ధోనీని కోహ్లీ గుర్తు చేసుకోవడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

అచ్చొచ్చిన ఆసియా కప్ టోర్నీ ద్వారా..
ఇకపోతే కోహ్లీ తన ట్వీట్‌కు జోడించిన చిత్రం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు సంబంధించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 51 బంతుల్లో అజేయంగా 82పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో గెలిపించాడు. జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో చివరిసారిగా ఆడిన కోహ్లీ ఒక నెల విరామం తీసుకున్నాడు. ఆసియా కప్ కోసం భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆసియా కప్ కోహ్లీకి అచ్చొచ్చిన టోర్నీ. ఈ టోర్నీలోనే కోహ్లీ తన అత్యుత్తమ స్కోరు 183 పాకిస్థాన్‌పై చేశాడు. ఇక ఫామ్ కోల్పోయిన కోహ్లీ.. ఆసియా కప్ ద్వారా మళ్లీ ఫామ్ పుంజుకునే అవకాశముంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications