Virat Kohli : డివిల్లీర్స్ మాటలు మ్యాజిక్‌లా పనిచేశాయి.. ఎమోషనల్ అయిపోయానన్న కోహ్లీ

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రపంచంలో క్రికెట్ ఆడే ప్రధాన దేశాలన్నింటిపై సెంచరీలు చేశాడు. మోడ్రన్ క్రికెట్ గ్రేట్స్‌లో ఒకడిగా చెప్పుకునే కోహ్లీ.. 2014లో ఇంగ్లండ్ వెళ్లినప్పుడు మాత్రం దారుణంగా విఫమయ్యాడు. ఆ సిరీసులో అతని బ్యాటింగ్ చూసిన చాలా మంది.. ఇలా బంతి స్వింగ్ అయ్యే పిచ్‌లపై కోహ్లీ ఆడలేడని తీర్పిచ్చేశారు కూడా. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న కోహ్లీ.. ప్రపంచంలో తను ఆడిన ప్రతి చోటా సెంచరీలు చేశాడు.

కౌంటీలు ఆడాల్సింది..
ఇలాంటి సమయంలో మరోసారి 2018లో ఇంగ్లండ్ పర్యటనకు కోహ్లీ వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ బ్యాటింగ్ మెరుగు పరుచుకునేందుకు అతన్ని కౌంటీల్లో ఆడించాలని బీసీసీఐ అనుకుంది. కానీ కోహ్లీకి మెడ నొప్పి రావడంతో కౌంటీలు ఆడలేకపోయాడు. దీంతో అతనిపై ఈ సిరీస్ మరింత ఒత్తిడి పెంచింది. ఆ సమయంలో సౌతాఫ్రికా లెజెండ్, కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిల్లీర్స్ చెప్పిన మాటలే ఒత్తిడి తగ్గించాయని విరాట్ చెప్పాడు. ఆ తర్వాత సిరీసులో కోహ్లీ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.

డివిల్లీర్స్ చెప్పిన మాటే మ్యాజిక్..
2018లో మెడ నొప్పి రావడంతో కౌంటీ క్రికెట్ ఆడలేకపోవడంతో చాలా టెన్షన్‌గా పెరిగిపోయిందని, కుదురుగా ఉండలేకపోయానని కోహ్లీ చెప్పాడు. ఈ క్రమంలోనే ఏబీ డివిల్లీర్స్‌తో మాట్లాడితే.. 'ఇదేం 2014 కాదు. నువ్వు అప్పటి ఆటగాడివి కూడా కాదు. నువ్వు అక్కడ బాగానే ఆడతావు చూడు' అని చెప్పాడట. ఆ మాటలు విన్న తర్వాత తనకు చాలా ప్రశాంతంగా అనిపించిందని కోహ్లీ వెల్లడించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌లో తొలి టెస్టు ఆడుతున్నప్పుడు వాతావరణం చాలా హీట్‌గా ఉందని, అక్కడి ఫ్యాన్స్ తను క్రీజులోకి వచ్చేప్పుడు ఎంత గోల చేశారో కూడా కోహ్లీ గుర్తుచేసుకున్నాడు.

35 వేల మంది ‘బూ..' అంటుంటే..
'2018లో ఫస్ట్ ఇన్నింగ్స్‌కు ముందు నా గుండె వేగంగా కొట్టుకోవడం నాకు ఇప్పటికీ గుర్తే. 2014లో ఏం జరిగిందో ఆ సీన్స్ అన్నీ ఒకసారి కళ్ల ముందు కదలాడాయి. అలా ఉండగానే వికెట్ పడింది. నేను మైదానంలో అడుగుపెట్టా. అలా వస్తున్నప్పుడు 30-35 వేల మంది ప్రేక్షకులు 'బూ...' అంటూ గోల చేశారు. అది చూస్తే ఇక్కడ ఆడే సత్తా మనకు లేదు. మనం గెలవలేవు అనే ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ ప్రేక్షకులు అలాంటి పరిస్థితి కల్పిస్తారు' అని కోహ్లీ వివరించాడు.

ఆ గర్జన ఇప్పటికీ గొప్పే..
ఆ మ్యాచ్‌లో 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీకి జీవనదానం లభించింది. అతను ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లండ్ ఫీల్డర్లు అందుకోలేకపోయారు. దాన్ని చక్కగా ఉపయోగించుకున్న అతను ఆ ఇన్నింగ్స్‌లో 149 పరుగులు చేశాడు. అక్కడ సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ గర్జన చూస్తేనే అది అతని కెరీర్‌లో ఎంత ముఖ్యమైన సెంచరీనో అర్థం అవుతుంది. దీంతో ఎలాంటి పరిస్థితుల్లో అయినా తను భారీ స్కోర్లు చేయగలనని కోహ్లీ నిరూపించుకున్నాడు కూడా. ఇప్పటికీ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్సుల గురించి మాట్లాడే సమయంలో ఈ గర్జన గురించి ప్రతి ఒక్కరూ ప్రస్తావిస్తారంటేనే.. అతని కెరీర్‌లో ఇది ఎంత కీలకమైన ఇన్నింగ్సో అర్థం చేసుకోవచ్చు.
ఎమోషనల్ అయిపోయా..
'ఆ మ్యాచ్‌లో నేను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ ఆండర్సన్ వేసిందే. ఎంత అదృష్టమో చూడండి (నవ్వేస్తూ). ఆ మ్యాచ్‌లో 22 పరుగులు చేసినప్పుడు నా క్యాచ్ వదిలేశారు. అందుకే నేను 149 రన్స్ చేయగలిగా. ఆ ఇన్నింగ్స్ తర్వాత నేను నా రూంలోకి వెళ్లి చాలా ఎమోషనల్ అయిపోయా. అనుష్క కూడా ఎమోషనల్ అయింది. నా గుండె ఎందుకు అంత వేగంగా కొట్టుకుంటుందో తను అర్థం చేసుకుంది. ఆ ఇన్నింగ్స్‌తో నా భుజాలపై ఉన్న పెద్ద బరువు తీసేసినట్లు అయింది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications