కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడకపోవడం మంచిదే: ఇంగ్లాండ్ టూర్‌పై దాదా

హైదరాబాద్: గత ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడ్డాడని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే తాజా పర్యటనలో మాత్రం తప్పక రాణిస్తాడని పేర్కొన్నాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం రెండు టీ20ల సిరిస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఐర్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత అటు నుంచి అటే సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ "కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి తప్పకుండా రాణిస్తాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడకపోవడం మంచిదే. అతనికి విశ్రాంతి తీసుకునే అవకాశం దొరికింది" అని గంగూలీ చెప్పాడు.

పరుగులు రాబట్టడంలో కోహ్లీ ఇబ్బంది
గతంలో అక్కడ పర్యటించినప్పుడు పరుగులు రాబట్టడంలో కోహ్లీ ఇబ్బంది పడ్డాడు. ఈసారి అలా కాకూడదనే కౌంటీల్లో ఆడేందుకు ఉత్సాహం చూపాడని గంగూలీ వెల్లడించాడు. నాలుగేళ్ల క్రితం ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు కోహ్లీ మొత్తం 10 ఇన్నింగ్స్‌ల్లో 13.40 సగటుతో 134 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే. దీంతో తాజా పర్యటనలో మాత్రం కోహ్లీ పరుగుల వరద పారిస్తాడని దాదా వ్యాఖ్యానించాడు.

ఇంగ్లాండ్ కూడా మంచి ఫామ్‌లో
‘‘5 టెస్టుల సిరీస్‌లో టీమిండియా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇంగ్లాండ్ కూడా మంచి ఫామ్‌లో ఉంది. సిరీస్ హోరాహోరీగా జరుగొచ్చు. 2 కొత్త బంతుల నేపథ్యంలో వన్డేల్లో రివర్స్ స్వింగ్ ప్రభావం తగ్గిపోతుంది. మైదానాలు పచ్చదనంతో ఉండుటుండటంతో రివర్స్ స్వింగ్ సాధ్యమవ్వట్లేదు. రివర్స్ స్వింగ్‌కు కావాల్సినంత పొడిగా, గరుకుగా బంతి మారడం లేదు" అని గంగూలీ అన్నాడు.

50 ఓవర్లలో 500 పరుగులు ఊహించని పరిణామం
"50 ఓవర్లలో 500 పరుగులు ఊహించని పరిణామం. బౌలర్ల పంథా మారాలి. అత్యుత్తమ బౌలర్లు ఎందుకు ఆడటం లేదో అర్థం కావట్లేదు. అక్రమ్, వకార్ లాంటి బౌలర్లు వన్డేలు, టెస్టులు ఆడారు. మెక్‌గ్రాత్, బ్రెట్ లీ, పొలాక్, డొనాల్డ్ కూడా అదే పని చేశారు. టెస్టులకు, వన్డేలకు భిన్నమైన బౌలర్లు ఉండాలన్న పద్ధతి నాకు అర్థం కావట్లేదు" అని అన్నాడు.

ప్రతి ఓవర్లో 3 బౌండరీలు
"ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్రతి ఓవర్లో 3 బౌండరీలు ఇచ్చింది. స్టార్క్, హాజిల్‌వుడ్‌లను ఆడించకపోవడం సరికాదు. అత్యుత్తమ బౌలర్లు బరిలో దిగాలి. నాథన్ లియాన్ ఎక్కువగా టెస్టులే ఆడుతున్నాడు. వన్డేలకు దూరంగా ఉంటున్నాడు. వార్న్, కుంబ్లే, మురళీధరన్ అన్ని ఫార్మాట్లలో ఆడారు'' అని గంగూలీ ఈ సందర్భంగా తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications