Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లీడింగ్‌ క్రికెటర్‌: 'రన్ మిషెన్' కోహ్లీ మరో అరుదైన ఘనత

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఆరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2016 సంవత్సరానికి గాను విజ్డెన్‌ ప్రపంచ లీడింగ్‌ క్రికెటర్‌గా ఎంపియ్యాడు. 2016లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే.

పరుగుల సునామీని సృష్టించి తన పేరిట ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. టెస్టుల్లో 75.93 యావరేజితో 1215 పరుగులు చేశాడు. 10 వన్డేల్లో 92.37 యావరేజితో ఏకంగా 739 పరుగులు సాధించాడు. అలాగే టీ20ల్లో 106.83 యావరేజితో 641 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం ఆరుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే ఒక ఏడాదిలో కోహ్లీ కన్నా ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో ఉన్నారు. అయితే వారంతా విరాట్ కోహ్లీ యావరేజిని అందుకోలేకపోయారు.

'2017 విజ్డెన్‌ కవర్‌పేజీ ముఖచిత్రానికి ఎంపికైన విరాట్‌ కోహ్లీ ఇప్పుడు 2016కు ప్రపంచ లీడింగ్‌ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు' అని విజ్డెన్‌ ప్రకటించింది. ఇదిలా ఉంటే విజ్డెన్‌ ప్రపంచ లీడింగ్‌ క్రికెటర్‌గా ఎంపికైన తొలి క్రికెటర్‌గా రికీ పాంటింగ్ నిలిచాడు.

Kohli named Wisden's Leading Cricketer in the World for 2016

2003లో పాంటింగ్ ఈ ఘనత సాధించాడు. ఇంతకు ముందే విజ్డెన్‌ 2017 ఎడిషన్‌ కవర్‌పేజీపై కోహ్లీ ముఖచిత్రం ప్రచురించిన సంగతి తెలిసిందే. 2016లో పరుగుల సునామీ సృష్టించిన విరాట్ కోహ్లీ బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవంలో పాలీ ఉమ్రీగర్‌ పురస్కారం అందకున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే విజ్డెన్ క్రికెట్ ప్రకటించిన ఈ ఏడాది ఐదుగురు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. 1997 తర్వాత ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లుగా మిస్పా ఉల్ హక్, యూనిస్ ఖాన్ నిలిచారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+