వరుసగా మూడో ఏడాది: విజ్డన్ అవార్డుకి ఎంపికైన విరాట్ కోహ్లీ

హైదరాబాద్: వరుసగా మూడో ఏడాది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. 2018 సంవత్సరానికి గాను విజ్డన్ క్రికెటర్ల అవార్డులను బుధవారం (ఏప్రిల్ 10)న ప్రకటించారు. ఉమెన్స్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
గత క్యాలెండర్ ఇయర్‌లో ఓ ఆటగాడి ప్రదర్శన ఆధారంగా ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్‌ను ఈ అవార్డుకి ఎంపిక చేస్తారు. 2018 సంవత్సరానికి గాను కోహ్లీతో పాటు జోస్ బట్లర్, శామ్ కర్రన్, రోరీ బర్న్స్, టమ్మీ బ్యూమౌంట్ (ఇంగ్లండ్ మహిళా క్రికెటర్)లు ఎంపికయ్యారు.

విరాట్ కోహ్లీ
2018లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మూడు ఫార్మాట్లు కలిసి మొత్తం 2735 పరుగులు సాధించాడు. విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు కోహ్లీ ఎంపిక అవడం మూడోసారి. డాన్ బ్రాడ్‌మన్ (10 సార్లు), జాక్ హాబ్స్ (8 సార్లు) తర్వాత మూడు సార్లు ఈ అవార్డుకి ఎంపికైన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 2018లో కోహ్లీ ఐదు టెస్టులాడి 59.3 యావరేజితో 593 పరుగులు సాధించాడు. ఇందులో మొత్తం ఐదు సెంచరీలు ఉన్నాయి.

స్మృతి మంధాన
గతేడాది భారత మహిళల జట్టు సాధించిన అనేక విజయాల్లో స్మృతి మంధాన కీలకపాత్ర పోషించింది. వన్డేల్లో 669 పరుగులు టీ20ల్లో 662 పరుగులు సాధించింది. ఉమెన్స్ సూపర్ లీగ్‌లో మంధాన 174.68 యావరేజితో మొత్తం 421 పరుగులు నమోదు చేసింది.

రషీద్ ఖాన్
ఆప్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్ వరుసగా రెండో ఏడాది లీడింగ్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని దక్కించుకున్నాడు. గతేడాది రషీద్ ఖాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆప్ఘన్ జట్టు తరుపున గతేడాది రషీద్ ఖాన్ 22 వికెట్లు తీశాడు. యావరేజి 8.68. ఇక, ఐపీఎల్ 2018 సీజన్‌లో రషీద్ ఖాన్ మొత్తం 21 వికెట్లు తీశాడు.

విజ్డన్ అవార్డుకు ఎంపికైన క్రికెటర్లు
విరాట్ కోహ్లీ
టమ్మీ బ్యూమౌంట్
జోస్ బట్లర్
శామ్ కర్రన్
రోరీ బర్న్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications