హైదరాబాద్: నవంబర్ 1 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరిస్‌కు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశానికి బోర్డు ప్రతినిధులు, సెలక్టర్లు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం 16 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ప్రకటించారు.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి ఆకట్టుకున్న హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్, ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తొలిసారి భారత జట్టులో స్థానం దక్కించుకున్నారు. నవంబరు 1 నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరిస్‌కు కేదార్ జాదవ్‌ను పక్కను పెట్టారు.

మరోవైపు ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్‌కు ఎంపికై ఒక మ్యాచ్ కూడా ఆడని వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాను కూడా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. నవంబరు 1న ఢిల్లీలో జరిగే టీ20 మ్యాచ్ అనంతరం నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు అంతకముందు చెప్పిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, కివీస్‌తో పరిమిత ఓవర్ల సిరిస్ అనంతరం శ్రీలంకతో జరగబోయే మూడు టెస్టుల సిరీస్‌కు గాను తొలి రెండు టెస్టులకు భారత జట్టును ప్రకటించారు. ఇందులో ఛటేశ్వర పుజారా, మురళీ విజయ్‌లు తిరిగి చోటు దక్కించుకోగా, టెస్టుల్లో రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు చోటు దక్కింది.
మరోవైపు టెస్టు జట్టులో ఇషాంత్ శర్మకు కూడా చోటు కల్పించారు. మరొకవైపు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్‌లు కూడా జట్టులో స్థానం దక్కింది. నవంబర్ 16 నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ మొదలు కానుంది.
న్యూజిలాండ్‌తో టీ20 సిరిస్‌కు టీమిండియా:
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, ధోని, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, నెహ్రా, సిరాజ్
శ్రీలంకతో తొలి రెండు టెస్టులకు టీమిండియా:
విరాట్ కోహ్లి(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్, పుజారా, రోహిత్ శర్మ, సాహా, కుల్దీప్ యాదవ్,హార్దిక్ పాండ్యా, మొహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ