'కోహ్లీ హద్దుమీరుతున్నాడు.. అతని ప్రవర్తన ఏం బాగాలేదు'(వీడియో)


పెర్త్: ఆస్ట్రేలియా గడ్డపై భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడని ఆ దేశ మాజీ క్రికెటర్లు మైకేల్ హస్సీ, బోర్డర్ మండిపడ్డారు. సాధ్యమైనంతవరకూ సైలెంట్‌గానే ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నా కెప్టెన్‌పై విమర్శలు అయితే ఏ మాత్రం తగ్గడం లేదు. పర్యటనకు ముందు నుంచే కోహ్లీనే టార్గెట్ చేసిన సీనియర్లు మరోసారి దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మైదానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌పై స్లెడ్జింగ్‌కి దిగడం, ఔటైనప్పుడు అతిగా సంబరాలు చేసుకోవడం సరికాదంటూ వారు అభిప్రాయపడ్డారు.
కెరీర్‌లో కోహ్లీకి ఇది 25వ టెస్టు సెంచరీ
శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి ఆలౌటవగా.. విరాట్ కోహ్లి (123: 257 బంతుల్లో 13ఫోర్లు, 1సిక్సు) సెంచరీ బాదడంతో భారత్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులతో బదులిచ్చింది. కెరీర్‌లో కోహ్లీకి ఇది 25వ టెస్టు సెంచరీ కాగా.. ఆస్ట్రేలియా గడ్డపై ఆరోది కావడం విశేషం.
పూర్తిగా నియంత్రణ కోల్పోయిన కోహ్లీ
‘మైదానంలో విరాట్ కోహ్లీ పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు. అతని వ్యవహారశైలి నాకు ఏమాత్రం నచ్చడం లేదు' అని మైకేల్ హస్సీ విమర్శించాడు. ‘ఇలా ఆన్ ఫీల్డ్‌లో అతిగా ప్రవర్తించే కెప్టెన్‌ని నేను ఇంత వరకూ చూడలేదు' అని బోర్డర్ మండిపడ్డాడు.
కవ్వించే తరహాలో మాట్లాడిన కోహ్లీ..
ఆదివారం ఆట ముగిసిన తర్వాత పెవిలియన్‌కి వెళ్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్‌తో మాటల యుద్ధానికి దిగిన విరాట్ కోహ్లీ.. కవ్వించే తరహాలో మాట్లాడిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అంతకముందు కూడా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ కోహ్లీ అతడిపై స్లెడ్జింగ్‌కి దిగడం కనిపించింది. సాధారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇలా స్లెడ్జింగ్‌కి దిగుతుంటారు. కానీ.. ఓ ప్రత్యర్థి కెప్టెన్ వారిపైనే ఇలా కవ్వింపులకి దిగడాన్ని హస్సీ, బోర్డర్ జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పుకొస్తున్నాడు.
నా బ్యాట్ మాట్లాడుతుంది. నేను కాదంటూ
ఆదివారం మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.. ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీని పూర్తి చేశాడు. ఈ సందర్భంగా సెంచరీ సంబరాలు చేసుకుంటూ నా బ్యాట్ మాట్లాడుతుంది. నేను కాదంటూ సంజ్ఞలు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications