'కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మనే కానీ... అతడి కంటే ముందు వాళ్లను అడ్డుకోవాలి'


హైదరాబాద్: విరాట్ కోహ్లీ కీలక ఆటగాడే అయినా.. ఒక్క అతన్ని ఔట్ చేయడంపై మాత్రమే దృష్టిపెట్టరాదని న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్ అన్నాడు. కోహ్లీని లక్ష్యంగా చేసుకుని రెచ్చగొడితే మొదటికే మోసానికి వస్తుందని టేలర్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు టీమిండియా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది.

ఐదు వన్డేలు, మూడు టీ20 సిరీస్
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20 సిరీస్ ఆడనుంది. బుధవారం నుంచి నేపియర్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో రాస్ టేలర్ మీడియాతో మాట్లాడుతూ "టెస్ట్ సిరీస్‌కు ముందు కోహ్లీని ఎలా అడ్డుకోవాలన్న ఆస్ట్రేలియాకు పుజారా రూపంలో ముప్పు ముంచుకొచ్చింది" అని అన్నాడు.

అలాంటి తప్పు చేయదల్చుకోలేదు
"ఎలాంటి అంచనాలు లేకుండా పర్యటనకు వచ్చిన పుజార భారత్‌కు సిరీస్ విజయాన్ని కట్టబెట్టాడు. మేము అలాంటి తప్పు చేయదల్చుకోలేదు. ప్రస్తుత ప్రపంచ వన్డే క్రికెట్‌లో కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్. ప్రస్తుతం అతడు అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అతణ్ని త్వరగా వెనక్కి పంపడమెలా అని ఆలోచించడం సహజం" అని రాస్ టేలర్ చెప్పుకొచ్చాడు.

కోహ్లి కంటే ముందు వాళ్లను అడ్డుకోవాలి
కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల రూపంలో భారత్‌కు మంచి ఓపెనర్లు ఉన్నారన్న విషయాన్ని సహచరులకు రాస్ టేలర్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. "పరుగుల వరదను ఆపేందుకు మేము ప్రయత్నిస్తాం. రోహిత్, ధావన్‌ల రూపంలో భారత్‌కు మంచి ఓపెనర్లున్నారు. కోహ్లి కంటే ముందు వాళ్లను అడ్డుకోవాలి" అని రాస్ టేలర్ అన్నాడు.

న్యూజిలాండ్ జట్టుకు రాస్ టేలర్ కూడా ఎంతో కీలకం
ఇదిలా ఉంటే, టీమిండియాకు కోహ్లీ ఎలాగో... న్యూజిలాండ్ జట్టుకు రాస్ టేలర్ కూడా ఎంతో కీలకం. గత కొన్నాళ్లుగా రాసే టేలర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది వన్డేల్లో విరాట్ కోహ్లీ సగటు 113 కాగా.. రాస్ టేలర్ 13 వన్డేల్లో 92 సగటుతో పరుగుల వరద పారించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications