విరాట్ కోహ్లీ అసాధారణ ఆటగాడు: ఇంగ్లాండ్ పేసర్ కితాబు


హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసాధారణ ఆటగాడని ఇంగ్లాండ్ యువ పేసర్ టామ్ కర్రన్ ప్రశసంల వర్షం కురిపించాడు. భవిష్యత్‌లో రెండు జట్లు తలపడ్డప్పుడు విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు.
మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ విడుదల అనంతరం టామ్ కర్రన్ మీడియాతో మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎలా ఔట్ చేస్తావన్న ప్రశ్నకు మాత్రం నో బాల్ అయితే కాదు అని సమాధానమిచ్చాడు.
ఆస్ట్రేలియాలో మైదానాలు చాలా బాగుంటాయని కితాబిచ్చిన కర్రన్ టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు ఆసక్తిగా సాగుతాయని చెప్పుకొచ్చాడు. ప్రేక్షకులు కూడా అసాధారణంగా హాజరవుతారని చెప్పాడు. ఆస్ట్రేలియాలోటీ20 వరల్డ్ కప్ ఆడటం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చాడు.

గతంలో ఎన్నడూ లేని విధంగా
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళల, పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ను ఒకే ఏడాది, ఒకే వేదికగా నిర్వహించనుంది. తొలుత మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఆ తర్వాత పురుషుల టీ20 వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. మహిళల వరల్డ్‌కప్ ఫిబ్రవరి 21న ప్రారంభమై మార్చి 8న ముగుస్తుంది. తొలి మ్యాచ్‌లో ఢిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. పురుషుల వరల్డ్‌కప్ అక్టోబర్ 18న ప్రారంభమై నవంబర్ 15న ముగుస్తుంది.

ఆస్ట్రేలియాలోని మొత్తం 13 వేదికల్లో
ఇక, పురుషుల టోర్నీలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. మహిళా టోర్నీల్లో 10 జట్లు పోటీపడనుండగా, పురుషుల టోర్నీలో 12 జట్లు పాల్గొననున్నాయి. ఈ రెండు టోర్నీలకు ఆస్ట్రేలియాలోని మొత్తం 13 వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి. రెండు వరల్డ్‌కప్‌ల ఫైనల్ మ్యాచ్‌లు మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.

అక్టోబర్ 24న దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన తొలి మ్యాచ్
పురుషుల టోర్నీలో టీమిండియా అక్టోబర్ 24న దక్షిణాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్‌తో టైటిల్ వేటను ప్రారంభించనుంది. ఇరు టోర్నీల్లో ఆయా జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించిన ఐసీసీ మహిళల టోర్నీలో సూపర్ 10, పురుషుల టోర్నీ సూపర్ 12 పద్దతిలో ఆడించనుంది. పురుషుల టీ20 టోర్నీకి శ్రీలంక, బంగ్లాదేశ్‌లు అర్హత సాధించని సంగతి తెలిసిందే.

క్వాలిఫయర్ మ్యాచ్‌లు కూడా
ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లు మరో ఆరు జట్లతో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడే 8 జట్లలో నాలుగు జట్లు టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించనున్నాయి. భారత పురుషుల జట్టు గ్రూప్-2లో ఉంది. ఇందులో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు మరో రెండు క్వాలిఫయర్ టీమ్స్ ఉంటాయి.
మహిళల వరల్డ్‌కప్ (ఫిబ్రవరి 21 -మార్చి 3)
గ్రూప్ ఎ: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, శ్రీలంక, క్వాలిఫయర్1
గ్రూప్ బి: ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, క్వాలిఫయర్ 2
సెమీఫైనల్స్: మార్చి 5
ఫైనల్ : మార్చి 8
పురుషుల వరల్డ్‌కప్ (అక్టోబర్ 18 - నవంబర్ 15)
గ్రూప్ స్టేజ్: అక్టోబర్ 18-23
గ్రూప్ 1: పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, రెండు క్వాలిఫయర్స్
గ్రూప్ 2: ఇండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, రెండు క్వాలిఫయర్స్
సెమీఫైనల్స్: నవంబర్ 11, 12
ఫైనల్: నవంబర్ 15
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications