
కోహ్లీ తుది జట్టులో మార్పులు చేస్తాడు
ఇటీవల శివరామకృష్ణన్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ తుది జట్టులో అనేక మార్పులు చేస్తాడు. ఎంఎస్ ధోనీ మాత్రం మార్పులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడు. పిచ్‌లను బట్టి విరాట్ ఆటగాళ్లను ఎంపిక చేస్తాడు. ఉన్నత ప్రమాణాలు, వైవిధ్యంతో బౌలింగ్ చేసే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తాడు. నైపుణ్యం కలిగిన బౌలర్లతోనే విరాట్ అధిక విజయాలు సాధిస్తున్నాడు' అని అన్నారు. మహీ కెప్టెన్‌గా 200 వన్డేలలో 110 విజయాలు టీమిండియాకు అందించాడు. మరోవైపు కోహ్లీ 89 వన్డేల్లో 62 విజయాలు సాధించాడు.

మూడు ఐసీసీ టైటిల్స్ నెగ్గిన ఏకైక కెప్టెన్ ధోనీ
'ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ టైటిల్స్ నెగ్గిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ముఖ్యమైన ఐసీసీ టోర్నీలు విరాట్ ఖాతాలో లేవు. విరాట్ ఎక్కువ శాతం సెమీఫైనల్ వరకు విజయాలు సాధిస్తున్నాడు కానీ సెమీఫైనల్‌లో అతనికి దురదృష్టం వెంటాడుతోంది. కోహ్లీకి ఎదో ఒకరోజు కలిస్తోంది. కోహ్లీ చాలా చురుకైన మరియు సహజమైన కెప్టెన్. దీంతోనే అతను ఇంకా మెరుగవుతున్నాడు. బ్యాట్‌తో పరుగులు చేయడమే కాకుండా కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు' అని శివరామకృష్ణన్ పేర్కొన్నారు.

కోహ్లీ అద్భుత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు
'విరాట్ దూకుడుగా ఉంటాడు. ధోనీ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. మనసులో ఏముందో అతని ముఖ కవళికల నుండి కూడా మనకు తెలియదు. కానీ ఎంఎస్ బౌలర్ల కెప్టెన్. ఇది ఏ బౌలర్‌కైనా ప్రయోజనం చేకూర్చేది' అని ప్రముఖ కామెంటేటర్ చెప్పుకొచ్చారు. గత కొంత కాలంగా అన్ని ఫార్మాట్‌లలో స్థిరమైన ఆటతీరును టీమిండియా ప్రదర్శిస్తోందని కొనియాడారు. అయితే కొన్ని మ్యాచ్‌లలో వివిధ కారణాల వల్ల ధోని జట్టులో లేకపోవడంతో కోహ్లీ అద్భుత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడన్నారు. కాగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారని శివరామకృష్ణన్ పేర్కొన్నారు.

కెరీర్ తొందరగా ముగుస్తుందనుకోలేదు
తన కెరీర్ కూడా తొందరగా ముగిసిపోవడంపై లక్ష్మణ్ శివరామకృష్ణన్ నిరాశ వ్యక్తం చేసాఋ. తనకు అంతర్జాతీయ క్రికెట్‌లో తక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించినా.. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. గవాస్కర్ మార్గనిర్దేశంలో గైడెన్స్ తనకు ఎంతగానో ఉపయోగిపడిందన్నారు. భారత్ తరఫున శివరామకృష్ణన్ 9 టెస్టులు, 16 వన్డేలను మాత్రమే ఆడారు. ఆ తర్వాత క్రికెట్ కామెంటేటర్ అవతారం ఎత్తారు. భారత్ తరఫున పెద్దగా సక్సెస్ కాకపోయినా.. కామెంటేటర్‌గా మాత్రం అద్భుతంగా రాణిస్తున్నారు.


Click it and Unblock the Notifications












