కోహ్లీ-హెడ్ షేక్ హ్యాండ్ వివాదం: భార్య జెస్సికాకు నరకం చూపించిన నెటిజన్లు!
స్టేడియంలో ప్లేయర్ల మధ్య జరిగే ఘర్షణలు కొన్నిసార్లు ఫ్యాన్స అత్యుత్సాహం వల్ల వ్యక్తిగత వివాదాలుగా మారుతుంటాయి. ఐపీల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య చోటుచేసుకున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ట్రావిస్ హెడ్ షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించగా.. విరాట్ కోహ్లీ ఆయనను పూర్తిగా విస్మరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదంలోకి విరాట్ కోహ్లీ అభిమానులు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికాను లాగి ఆమె పట్ల ఆన్‌లైన్లో దారుణంగా ప్రవర్తించడం ఇప్పుడు క్రీడాలోకంలో కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంచలన విషయాలను బయటపెట్టింది. షేక్ హ్యాండ్ వివాదం తర్వాత తనకు, తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు సోషల్ మీడియాలో విపరీతమైన ద్వేషపూరిత కామెంట్లు, ప్రైవేట్ మెసేజ్‌లు వస్తున్నాయని ఆమె వెల్లడిచింది. ఆస్ట్రేలియన్ మీడియా సంస్థ 'ది అడ్వర్టైజర్'తో జెస్సికా మాట్లాడుతూ.. "నేను ఉదయం నిద్ర లేచేసరికి నా సోషల్ మీడియా ఖాతాలన్నీ ట్రోలింగ్‌తో నిండిపోయాయి. మేము బాగానే ఉన్నాము, కానీ నా స్నేహితులు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారు" అని ఆవేదన వ్యక్తం చేసింది.

గతంలో కూడా తాము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని జెస్సికా గుర్తుచేసింది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, 2024 బాక్సింగ్ డే టెస్టుల్లో ఇండియాను ఆస్ట్రేలియా ఓడించినప్పుడు కూడా భారత అభిమానులు తనను ఇలాగే ట్రోల్ చేశారని.. ఇప్పుడు ఐపీఎల్ 2026లో అదే రిపీట్ అవుతోందని ఆమె పేర్కొంది. క్రీడలలో దూకుడు సహజమే అయినప్పటికీ.. ఆట వెనుక నిజమైన మనుషులు, వారి కుటుంబాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని.. మానసిక ఆరోగ్యం, ఒకరినొకరు గౌరవించుకునే విధానంపై చర్చ జరగాలని ఆమె హితవు పలికింది.
అసలు విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదం ఎలా మొదలైందంటే?
అసలు విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదం ఎలా మొదలైందనే వివరాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టేడియంలో వీరిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ట్రావిస్ హెడ్ మైదానంలో కోహ్లీని ఉద్దేశించి ఇంకాస్త దూకుడుగా ఆడాలని అనడంతో కోహ్లీ స్పందిస్తూ.. 'నువ్వే స్వయంగా వచ్చి బౌలింగ్ చెయ్' అని సవాల్ విసిరాడు. ఆ తర్వాత కోహ్లీ ఔట్ కాగానే, హెడ్ స్పందిస్తూ.. 'నాకు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు' అంటూ కవ్వించాడు. ఈ కామెంట్స్ కోహ్లీకి నచ్చకపోవడంతోనే మ్యాచ్ ముగిశాక హెడ్‌కు కరచాలనం ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 55 పరుగుల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications