Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీలో ఆస్ట్రేలియా స్ఫూర్తి: పొగడ్తలతో ముంచెత్తిన క్లార్క్

హైదరాబాద్: ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆసీస్ మీడియాతో పాటు జట్టులోని కొందరు ఆటగాళ్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుపై బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా కోహ్లీ సాధిస్తున్న విజయాల పట్ల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ల ప్రశంసల జల్లు కొనసాగుతోంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్‌)లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ రెండు రోజుల క్రితం కెప్టెన్సీలో కోహ్లీని పాంటింగ్‌తో పోల్చిన సంగతి తెలిసిందే.

Kohli has lot of Australian spirit in him: Michael Clarke

తాజాగా ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కూడా పొగడ్తలతో ముంచెత్తాడు. 'ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీకి అభిమానులు లేరన్న వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. కోహ్లీకి ఆస్ట్రేలియాలో కూడా పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. అతనిలో ఆసీస్‌ స్ఫూర్తి ఉంది' అని ఆస్ట్రేలియాలో టూరిజాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమంలో క్లార్క్ చెప్పాడు.

'నిజం చెప్పాలంటే క్రికెట్‌ అంటే కోహ్లీకి ఎంతో ఇష్టం, కసి. ఆ కసితోనే అతడు మైదానంలో ప్రత్యర్థులపై పైచేయి సాధించి విజయాలను అందుకోగలుగుతున్నాడు. మైదానంలో దూకుడుగా కనిపించే కోహ్లీ వెలుపల మాత్రం చాలా మంచి వ్యక్తి. మైదానం బయట కోహ్లీని ఇష్టపడని ఆస్ట్రేలియా క్రికెటర్ ఉండరు' అని క్లార్క్ అన్నాడు

'ఈ ఏడాది ఆరంభంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌ సమయంలో కోహ్లీకి వ్యతిరేకంగా ఆసీస్‌ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. అయినప్పటికీ అతనికి మా దేశంలో ప్రత్యేక గౌరవం ఉందని నేను కచ్చితంగా చెప్పగలను' అని క్లార్క్‌ అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+