ముంబై: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎప్పుడూ దూకుడుగానే ఉంటాడు. అయితే, మైదానం బయట మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అభిమానులను మైదానంలోనూ, బయట కూడా ఉత్సాహ పరుస్తుంటాడు కోహ్లీ.
నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా తనని కలిసేందుకు వచ్చిన అభిమానులకి సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంటాడు కూడా. తాజాగా, అమెరికాలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన విరాట్ కోహ్లీని ఓ వీరాభిమాని కలిశారు.
ఓ 90ఏళ్ల బామ్మ శ్రమించి తనను కలిసేందుకు ప్రత్యేకంగా రావడంతో ఉబ్బితబ్బిబైన విరాట్ కోహ్లి మైదానంలో తను ధరించే జెర్సీని కానుక ఇచ్చేశాడు.