For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దూకుడు కాదు..దురుసుత‌నం! అంత‌లా అప్పీల్ చేస్తే అంపైర్లు ఊరుకుంటారా?

ICC Cricket World Cup 2019 : Virat Kohli Fined 25% Match Fee For Excessive Appealing || Oneindia
Kohli Fined for Excessive Appealing During Clash Vs Afghanistan

సౌతాంప్ట‌న్‌: భార‌త క్రికెట్ జ‌ట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ మ‌న‌స్తత్వం ఎలాంటిదో మ‌న‌కు తెలుసు. మ్యాచ్ సంద‌ర్భంగా గ్రౌండ్‌లో వికెట్ ప‌డితే ఎలాంటి హావ‌భావాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారో చూస్తూనే ఉంటాం. వికెట్ ప‌డిన ప్ర‌తీసారి త‌న దూకుడుతనాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. బ్యాటింగ్‌లోనూ విరాట్ కోహ్లీది అదే శైలి. బౌల‌ర్‌పై ఎదురుదాడి చేయ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తుంటాడు. ఈ దూకుడు వైఖ‌రిని చూసే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత‌నికి అభిమానులు ఏర్ప‌డ్డారు. అది వేరే విష‌యం. తాజాగా ఆ దూకుడు మ‌న‌స్తత్వ‌మే విరాట్ కోహ్లీకి చిక్కుల‌ను తెచ్చి పెట్టింది. దాన్ని దూకుడు అనబోర‌ని, దురుసుత‌నం అని పేరు పెట్టారు అభిమానులు.

అస‌లు విష‌యం ఏమిటంటే..

అస‌లు విష‌యం ఏమిటంటే..

ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లోని సౌతాంప్ట‌న్ రోజ్‌బౌల్ స్టేడియంలో శ‌నివారం ఆప్ఘ‌నిస్తాన్‌తో మ్యాచ్‌ను అతి క‌ష్టం మీద గెలుచుకుంది టీమిండియా. టాస్ గెలిచిన త‌రువాత భారీ స్కోరు చేయాల‌నే ఉద్దేశంతో కేప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప‌రిస్థితి అత‌ను ఆశించిన దానికి భిన్నంగా క‌నిపించింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నందుకు బ‌హుశా కోహ్లీ ప‌శ్చాత్తాప‌డి ఉండొచ్చు. అంత క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు ఆఫ్ఘ‌నిస్తాన్ ఆట‌గాళ్లు. తొలి నాలుగు ఓవ‌ర్ల‌లో ఏడు పరుగులే చేయ‌డం, రోహిత్ శ‌ర్మ వికెట్ కోల్పోవ‌డం.. 50 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 224 ప‌రుగులే స్కోరుబోర్డులో జ‌త కావ‌డం.. ఇవ‌న్నీ కోహ్లీని అస‌హ‌నానికి గురి చేసి ఉండొచ్చు.

ఫీల్డింగ్‌లో అంపైర్‌పై..

ఫీల్డింగ్‌లో అంపైర్‌పై..

ఈ అస‌హ‌నాన్నంత‌టినీ విరాట్ కోహ్లీ అంపైర్‌పై ప్ర‌ద‌ర్శించాడా? అనేలా ప్ర‌వ‌ర్తించాడ‌త‌ను. ఫీల్డింగ్ సంద‌ర్భంగా అంపైర్‌‌లతో విరాట్‌ కోహ్లీ వాగ్వివాదానాకి దిగాడు. చేతులు జోడించి మ‌రీ గట్టిగా అప్పీల్ చేస్తూ క‌నిపించాడు. ఆప్ఘ‌నిస్తాన్ బ్యాట్స్‌మెన్ హజ్రతుల్లా బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో మ‌హ‌మ్మ‌ద్ షమీ సంధించిన ఓ బంతి అత‌ని ప్యాడ్ల‌ను తాకింది. దీనిపై ష‌మీ, వికెట్ కీపర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ, కేప్టెన్ కోహ్లీ.. వీరంతా ఎల్‌బీడబ్ల్యూ కోసం గ‌ట్టిగా అప్పీల్ చేశారు. అయిన‌ప్ప‌టికీ.. అంపైర్ ఉల‌క‌లేదు, ప‌ల‌క‌లేదు. దీనితో కోహ్లీ అస‌హ‌నానికి గుర‌య్యాడు. ష‌మీ, ధోనీల‌తో మాట్లాడాడు. అనంత‌రం డీఆర్ఎస్ కోరాడు.

చేతులు జోడించి..

చేతులు జోడించి..

ఈ సంద‌ర్భంగా కోహ్లీ అంపైర్ల‌తో కొద్దిసేపు వాదించాడు. చేతులు జోడించి.. బంతి స్టంప్స్ మీదుగా వెళ్లింద‌ని అంటూ అంపైర్ల‌తో వాదులాడాడు. అప్ప‌టికీ త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోలేదు అంపైర్లు. చివరకు డీఆర్ఎస్‌లోనూ అత‌నికి ఎదురుదెబ్బే త‌గిలింది. అప్పీల్ సంద‌ర్భంగా విరాట్ కోహ్లీ అంపైర్ల‌తో వాగ్వివాదానికి దిగ‌డం ప‌ట్ల అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అత‌నిపై చ‌ర్య‌ల‌కు దిగింది. భారీగా జ‌రిమానా విధించింది. విరాట్ కోహ్లీకి ద‌క్కాల్సిన మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి (ఐసీసీ కోడ్ ఆఫ్ కండ‌క్ట్‌)లోని ఆర్టిక‌ల్ 2.1 ప్ర‌కారం.. కోహ్లీ ప్ర‌వ‌ర్త‌న విరుద్ధ‌మైన‌ద‌ని ఐసీసీ ప్ర‌తినిధి తెలిపారు.

ఆర్టిక‌ల్ 2.1 నియ‌మాన్ని ఉల్లంఘించిన కోహ్లీ..

ఆర్టిక‌ల్ 2.1 నియ‌మాన్ని ఉల్లంఘించిన కోహ్లీ..

అంపైర్ల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, ఇది ఆర్టిక‌ల్ 2.1 ప్ర‌కారం ఐసీసీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని చెప్పారు. ఈ స్థాయిలో అప్పీల్ చేయ‌డం, అంపైర్ల‌తో వాగ్వివాదానికి దిగ‌డం వంటి చ‌ర్య‌లు ఐసీసీ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ ప్ర‌కారం.. తీవ్ర‌మైన‌దిగా భావిస్తారు. లెవెల్ 1 నిబంధ‌న‌ను ఉల్లంఘించిట్లుగా గుర్తిస్తారు. దీని ప్ర‌కారం.. కోహ్లీపై చ‌ర్య‌లు తీసుకుంది ఐసీసీ. అత‌నికి ద‌క్కాల్సిన మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అలీమ్‌దార్‌, రిచ‌ర్డ్ ఇల్లింగ్ వ‌ర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా వ్య‌వ‌హ‌రించారు. రిచ‌ర్డ్ కెటిల్ బోరో థ‌ర్డ్ అంపైర్‌గా ఉన్నారు.

Story first published: Sunday, June 23, 2019, 15:56 [IST]
Other articles published on Jun 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+