Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ.. కౌంటీల్లో ఆడటం ఇష్టం లేకనే ఇన్ని మార్పులు చేశారా?

Kohli confusion: BCCI names skipper for Ireland T20s despite county commitments

హైదరాబాద్: బీసీసీఐ కావాలనే చేసిందా.. సాధ్యమవుతుందనే తలచి చేసిందా..? అనే ప్రశ్న కోహ్లీ అభిమానికి గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్ట్‌తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లు, ఇంగ్లండ్ వన్డే సిరీస్ కోసం మంగళవారం సెలక్షన్ కమిటీ టీమ్స్‌ను ప్రకటించింది. అయితే వచ్చే నెల మొత్తం కోహ్లి కౌంటీల్లో ఆడనుండటంతో ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్ట్‌కు అతను అందుబాటులో ఉండటం లేదని రహానేను కెప్టెన్‌గా ప్రకటించారు.

జూన్ 25 నుంచి 28 వరకు సర్రే మ్యాచ్ ఆడనున్న కోహ్లి

జూన్ 25 నుంచి 28 వరకు సర్రే మ్యాచ్ ఆడనున్న కోహ్లి

ఐర్లాండ్ టీ20లకు కూడా కోహ్లి అందుబాటులో ఉండడని మొదట్లో భావించారు. కానీ టీమ్‌లో మాత్రం కోహ్లినే కెప్టెన్ అని స్పష్టంచేశారు. ఇదే అయోమయానికి దారి తీసింది. జూన్ 28 వరకు కోహ్లి సర్రె టీమ్‌తో ఉండాల్సి ఉంది. తన చివరి కౌంటీ మ్యాచ్‌ను జూన్ 25 నుంచి 28 వరకు కోహ్లి ఆడనున్నాడు. ఐర్లాండ్‌తో టీ20లు జూన్ 27, 29న ఉన్నాయి. కోహ్లి సర్రె టీమ్‌తో ఉంటే ఐర్లాండ్‌తో టీ20లు ఎలా ఆడతాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కోహ్లి నిర్ణయాన్ని తప్పుబడుతున్న బీసీసీఐలోని ఓ వర్గం

కోహ్లి నిర్ణయాన్ని తప్పుబడుతున్న బీసీసీఐలోని ఓ వర్గం

ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్ట్ ఆడకుండా కౌంటీలకు వెళ్లాలన్న కోహ్లి నిర్ణయాన్ని తప్పుబడుతున్న బీసీసీఐలోని ఓ వర్గం అతన్ని కావాలనే టీ20 టీమ్‌లో ఇరికించినట్లు తెలుస్తుంది. అటు సర్రె టీమ్ మాత్రం కోహ్లి జూన్ 28 వరకు తమతోనే ఉంటాడని స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను అడగగా.. దీనిపై ఏదైనా ఉంటే బీసీసీఐ కార్యదర్శితో మాట్లాడండి అని అనడం గమనార్హం.

సర్రె టీమ్ తరఫున చివరి మ్యాచ్

సర్రె టీమ్ తరఫున చివరి మ్యాచ్

బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరిని ప్రశ్నించగా.. అన్నీ సర్దుకుంటాయి అంటూ సమాధానమిచ్చారు. దీనిపై కోహ్లి ఏమనుకుంటున్నాడనేది మాత్రం తెలియలేదు. టీమ్‌లోకి ఎంపిక చేశారు అంటే కోహ్లి కచ్చితంగా ఆడాల్సిందే. అంటే ఆ లెక్కన సర్రె టీమ్ తరఫున చివరి మ్యాచ్ ఆడే అవకాశం అతనికి ఉండదు.

కోహ్లి కౌంటీల్లో అంశంపై భిన్నాభిప్రాయాలు:

కోహ్లి కౌంటీల్లో అంశంపై భిన్నాభిప్రాయాలు:

కేవలం రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లతోనే అతను సర్దుకోవాల్సి ఉంటుంది అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. మొత్తానికి కోహ్లి కౌంటీల్లో ఆడే అంశంపై బోర్డులోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టమవుతుంది.

Story first published: Wednesday, May 9, 2018, 15:28 [IST]
Other articles published on May 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+