ఇండోర్ : ఇండోర్ వేదికగా ప్రారంభమైన భారత్ న్యూజిలాండ్ మూడో టెస్టు మొదటి ఇన్సింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. తనదైన ఆటతీరుతో రాణించిన కోహ్లి సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. మరోవైపు రహానే కూడా 75 పరుగులతో సెంచరీకి దగ్గరగా సాగుతుండడం విశేషం. కాగా, కోహ్లికి టెస్టుల్లో ఇది పదమూడవ సెంచరీ.
మూడో టెస్టు మ్యాచులో ఓపెనర్లు విఫలమైనా.. భారత కెప్టెన్ కోహ్లి టీమ్ ఇండియాను ఆదుకున్నాడు. తొలుత 108 బంతుల్లో ఐదు ఫోర్లతో అర్థ శతకాన్ని అందుకున్నాడు కోహ్లి. ఇదే క్రమంలో అజింక్యా రహానేతో కలిసి కోహ్లి 66 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.

విండీస్ తో సిరీస్ లో డబుల్ సెంచరీ సాధించిన కోహ్లి.. ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజా అర్థ సెంచరీతో కోహ్లి ఫామ్ లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. ఆరంభంలో కాస్త ఆచీ తూచీ ఆడిన కోహ్లి.. సందర్బానుసారం బంతిని బౌండరీకి తరలిస్తూ.. స్కోరు బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం భారత స్కోరు 261/3గా కొనసాగుతోంది.