For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడేళ్లలో ఎన్నో మార్పులు: బెస్ట్-11 ఎంచుకోవడం కోహ్లీకి తెలియదు

By Nageshwara Rao

హైదరాబాద్: బెస్ట్‌-11 ఎంచుకోవడంలో సెలక్షన్‌ కమిటీ, కోహ్లీ విఫలమవుతున్నారని సెంచూరియన్ టెస్టు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ కోపం తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అసలు బెస్ట్-11 అంటే ఏంటని ఎదురు ప్రశ్నించాడు. 'ఒకవేళ మేం గెలిచి ఉంటే బెస్ట్‌ 11 అన్న ప్రస్తావన వచ్చేదా? ఫలితం ప్రకారం తుది జట్టును నిర్ణయించలేం. ఊరికే కూర్చుని మాట్లాడటం కాదు. మైదానంలో దిగితే తెలుస్తుంది. ఇకపై జట్టును మీరే సెలక్ట్‌ చేయండి. మేం ఆడతాం' అంటూ కోహ్లీ అన్నాడు. నిజానికి గత మూడేళ్లుగా కోహ్లీ టెస్టు కెప్టెన్సీని చూస్తే తుది జట్టు ఎంపికలో గందరగోళానికి గురవుతూనే ఉన్నాడు.

సొంతగడ్డపై వరుస విజయాలు

సొంతగడ్డపై వరుస విజయాలు

దక్షిణాఫ్రికా పర్యటనక ముందు వరకు సొంతగడ్డపై వరుస విజయాలతో కోహ్లీసేన దూసుకుపోతుంటే ఈ విషయం పెద్దగా ఎవరికీ కనిపించలేదు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో మరో టెస్టు మ్యాచ్ మిగిలుండగానే ఆతిథ్య దక్షిణాఫ్రికా 2-0తో సిరిస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ ఎంచుకున్న తుది జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాదు విదేశాల్లో మంచి రికార్డు ఉన్న రహానేను కాదని రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు కల్పించడం.... తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన భువీని తప్పించి అతడి స్థానంలో ఇషాంత్ శర్మకు చోటు కల్పించడం లాంటివి.

 బెస్ట్-11 ఎంచుకోవడం కోహ్లీకి తెలియదు

బెస్ట్-11 ఎంచుకోవడం కోహ్లీకి తెలియదు

దీంతో కోహ్లీకి అసలు బెస్ట్-11 ఎంచుకోవడమే తెలియదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ మూడేళ్లలో విరాట్ కోహ్లీ 34 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ 34 టెస్టుల్లో తుది జట్టు కాంబినేషన్‌ను వరుసగా రెండు టెస్టుల్లో కొనసాగించలేదు. అంటే 34 సార్లు తుది జట్టులో మార్పులు చేశాడు. ఈ విషయాన్ని సెంచూరియన్ టెస్టు ఓటమి అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఓ దక్షిణాఫ్రికా రిపోర్టర్ ప్రస్తావించాడు. ఈ మూడేళ్లలో కనీసం ఒక్క ఆటగాడిని కనీసం ఏడు టెస్టుల్లో మార్చాడు. అలాగే 16 టెస్టుల్లో ఇద్దరు ఆటగాళ్లను, ఆరు టెస్టుల్లో ముగ్గురు ఆటగాళ్లను, నాలుగు టెస్టుల్లో నలుగురు ఆటగాళ్లను కోహ్లీ మార్చాడు.

కెప్టెన్‌గా తొలి టెస్టులో ఐదుగురు ఆటగాళ్ల మార్పు

కెప్టెన్‌గా తొలి టెస్టులో ఐదుగురు ఆటగాళ్ల మార్పు

2014లో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టు కోహ్లీకి కెప్టెన్‌గా తొలి టెస్టు. ఈ టెస్టులో ఐదుగురు ఆటగాళ్లను మార్చాడు. అంతేకాదు ముగ్గురు ఓపెనర్లు విజయ్, ధావన్, రాహుల్‌లలో ఎప్పుడూ ఒక కాంబినేషన్‌తో కోహ్లీ సంతృప్తి చెందక పోవడం విశేషం. వాళ్లు గాయాలు పాలవడం లేదా ఫామ్ కోల్పోవడం వల్లో ఓపెనింగ్ జోడీని మార్చాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో విజయ్ 25 టెస్టులు, రాహుల్ 20, ధావన్ 17 టెస్టులు ఆడారు. ఇదే కాలంలో టీమిండియా మొత్తం ఏడుగురు ఓపెనర్లను ఆడించడం విశేషం. ఈ సమయంలో మురళీ విజయ్, పుజారా, రాహుల్, శిఖర్ ధావన్, పార్థివ్ పటేల్, గౌతమ్ గంభీర్, అభినవ్ ముకుంద్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

కోహ్లీ కెప్టెన్సీలో ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే అరంగేట్రం

కోహ్లీ కెప్టెన్సీలో ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే అరంగేట్రం

కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈ మూడేళ్ల కాలంలో కేవలం ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే టెస్టు అరంగేట్రం చేశారు. వారెవరంటే కరణ్ శర్మ, నమన్ ఓజా, జయంత్ యాదవ్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా. వీరంతా కోహ్లీ కెప్టెన్సీలోనే టెస్టుల్లో అరంగేట్రం చేశారు. కోహ్లీ కెప్టెన్సీలో అత్యధిక టెస్టు మ్యాచ్‌లాడిన ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. మొత్తం 34 టెస్టుల్లో 33 మ్యాచుల్లో అశ్విన్ ఆడాడు. ఈ టెస్టుల్లో అశ్విన్ 193 వికెట్లు తీయడంతోపాటు 1159 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న రహానే, కోహ్లీ కెప్టెన్సీలో 30 టెస్టులు ఆడాడు.

కోహ్లీ కెప్టెన్సీలో దురదృష్టవంతుడు అతడే

కోహ్లీ కెప్టెన్సీలో దురదృష్టవంతుడు అతడే

అందులో 39.75 సగటుతో 1312 పరుగులు చేశాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఎవరైనా దురదృష్టవంతుడు ఉన్నాడంటే మాత్రం అది భువనేశ్వర్ కుమారే. భువీకి కేవలం 8 టెస్టుల్లో ఆడే అవకాశం వచ్చింది. ఇక, ఒకే ఒక్కసారి వరుసగా రెండు టెస్టుల్లో భువనేశ్వర్ ఆడాడు. పుజారా, సాహా చెరో 29 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించారు. రెగ్యులర్‌గా మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చే పుజారా 54.67 యావరేజితో 2187 పరుగులు చేశాడు. ఇక, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆరో స్థానంలో రోహిత్ శర్మ 17 టెస్టులు ఆడాడు. ఈ మూడేళ్ల కాలంలో అత్యధికంగా ఆరో నంబర్ బ్యాటింగ్ స్థానం కోసం 9 మార్పులు చేశాడు.

Story first published: Friday, January 19, 2018, 17:45 [IST]
Other articles published on Jan 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+