
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్ సిడ్నీ వేదికగా ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అటు తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలని అనుకున్నట్లు కోహ్లి చెప్పాడు. ఈ మ్యాచ్‌కు కూడా ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది. సిడ్నీలో వర్షం కురిసే అవకాశం లేకపోవడం కాస్త ఊరట కలిగించే విషయం.
భారత్ వరుసగా మూడో టీ20లోనూ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతుండగా.. ఆస్ట్రేలియా మాత్రం ఒక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ బెరెన్‌డార్ఫ్ స్థానంలో మిచెల్ స్కార్ట్‌ని తీసుకుంది. బ్రిస్బేన్‌లో గత బుధవారం రాత్రి ముగిసిన తొలి టీ20లో 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందగా.. వర్షం కారణంగా మెల్‌బోర్న్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే.
దీంతో.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా సిరీస్‌ను చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో.. మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.
భారత్ తుది జట్టు ఇదే: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్
ఆస్ట్రేలియా తుది జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), క్రిస్ లిన్,డీఆర్క్ షార్ట్, బెన్ మెక్‌డెర్మాట్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, అలెక్స్ కేరీ, నాథన్ కౌల్టర్ నైల్ , ఆండ్రూ టై, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.