జైపూర్ ఏనుగుని తరలించాలంటూ విరాట్ ఆవేదన

న్యూ ఢిల్లీ: పూర్తిగా వెజిటేరియన్‌గా మారిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏనుగు సంరక్షణ కోసం ఆవేదనతో అభ్యర్థించారు. 'పెటా' తరఫున ఆయన 'నంబరు 44' అనే ఏనుగుకు పునరావాసం కల్పించాలంటూ రాజస్థాన్ అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు గురువారం లేఖ రూపంలో విన్నవించుకున్నారు. గతేడాది జూన్‌లో 8 మంది వ్యక్తులు అంబర్ ఫోర్ట్ వద్ద ఈ ఏనుగు మీద దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆ ఏనుగు ఇంకా కోలుకోకముందే సవారీలకు ఉపయోగిస్తున్నారు.

దాడి సంగతి తెలిసి సిగ్గుపడుతున్నా
‘ఒక క్రికెటర్‌గా, భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుందన్నందుకు గర్వపడుతున్నా. అయితే ‘నంబరు 44' మీద గత సంవత్సరం జూన్‌లో దాడికి పాల్పడ్డ సంగతి తెలిసింది. దానికి నేను సిగ్గుపడుతున్నా' అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు టీమిండియా కెప్టెన్.

ఏనుగును పునరావాసానికి తరలించాలని
‘జంతువుల మీద హింసకు పాల్పడటం ఏమాత్రం అంగీకారమైంది కాదు. వెంటనే ఆ ఏనుగును సరైన సౌకర్యాలున్న పునరావాస కేంద్రానికి తరలించాలని కోరుతున్నా. ఒంటి నిండా గొలుసులు, దాడులు, భయానికి దూరంగా ఇతర ఏనుగులతో కలిసి జీవించేలా సౌకర్యాలు కల్పించండి' అని ఆ లేఖలో మంత్రిత్వ శాఖను కోరారు.

గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు
పెటా సంస్థ ‘నంబరు 44' సంరక్షుడు వాసిద్ ఖాన్ మీద ఫిర్యాదు చేసింది. వెంటనే ఛీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అతడికి షోకాజు నోటీసులు జారీ చేశారు. ఆ ఫిర్యాదు తర్వాత కోహ్లీ ఈ లేఖ రాశారు. జైపూర్ పోలీసులు ఈ ఏనుగుపై దాడికి పాల్పడినందుకు ఇప్పటికే కొందరు గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు.

జంతువులు మన సొంతం కాదు
‘జంతువులను మన వినోదం కోసం ఉపయోగించడానికి అవి మన సొంతం కాదు' అనేది పెటా ఇండియా మోటో. జయపురలో కొందరు వ్యక్తులు ఏనుగులను సవారీల కోసం ఉపయోగిస్తుంటారు. వ్యక్తిగత ప్రయోజనం కోసం వాడుకుంటున్నా.. వాటికి సరైన ఆహారం , సంరక్షణ లభించదు. రోజులో చాలా సేపు బలవంతంగా నిలబెట్టి ఉంచుతారు. దీంతో వాటికి పలు అనారోగ్య సమస్యలు (పాదాల నొప్పులు, ఆర్థరైటిస్) వంటి సమస్యలతో బాధపడుతున్నా పట్టించుకునేవారే ఉంటారు. ఈ ప్రభావంతో కొన్ని ఏనుగులైతే చిన్న వయసులో మరణిస్తున్న దాఖలాలు కూడా లేకపోలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications