Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాప్‌లోనే కోహ్లీ, బుమ్రా: కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకుకి రాస్ టేలర్

Kohli, Bumrah maintain No. 1 spot in latest ICC ODI rankings

హైదరాబాద్: ఐసీసీ తాజాగా మంగళవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు తమ అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు. న్యూజిలాండ్-పాకిస్థాన్, ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా సిరిస్‌లు ముగిసిన తర్వాత ఐసీసీ మంగళవారం వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది.

ఐసీసీ ప్రకటించిన బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో 899 పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(871) జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌తో ముగిసిన సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ తన కెరీర్‌లోనే బెస్ట్ ర్యాంకుని అందుకున్నాడు.

కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకుకి రాస్ టేలర్

కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకుకి రాస్ టేలర్

ఈ సిరిస్‌తో 80కి పైగా పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న రాస్ టేలర్ మూడు స్థానాలు ఎగబాకి కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. ఐసీసీకి ఇచ్చిన ఇంటర్యూలో రాస్ టేలర్ మాట్లాడుతూ "కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకుకి చేరుకోవడం ఆనందంగా ఉంది. అదే విధంగా నాలో ఇంకా కొన్ని పరుగులు మిగిలున్నాయి" అని అన్నాడు.

ఎనిమిదో స్థానంలో శిఖర్ ధావన్

ఎనిమిదో స్థానంలో శిఖర్ ధావన్

ఓపెనర్ శిఖర్ ధావన్ ఒక ర్యాంకు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. దీంతో టాప్-10లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్లు చోటు దక్కించుకున్నారు. గత కొన్నేళ్లుగా భారత జట్టులోని ఆటగాళ్లు నిలకడగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 20వ ర్యాంకులో నిలిచాడు.

అగ్రస్థానంలో బుమ్రా

అగ్రస్థానంలో బుమ్రా

బౌలర్ల విషయానికి వస్తే ముగ్గురు భారత బౌలర్లు స్థానం టాప్-10లో చోటు సంపాదించుకున్నారు. 841 పాయింట్లతో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు, యువ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు.

ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో రషీద్ ఖాన్

ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో రషీద్ ఖాన్

దక్షిణాఫ్రికాకు చెందిన ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ యథావిథిగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే దక్షిణాప్రికా వన్డే జట్టులో చోటు దక్కించుకున్న డేల్ స్టెయిన్ ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో రషీద్ ఖాన్ 353 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, November 13, 2018, 15:39 [IST]
Other articles published on Nov 13, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+