For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి వన్డే: సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో వన్డేల్లో విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్‌ రికార్డుని కోహ్లీ

By Nageshwara Rao

హైదరాబాద్: పూణే వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో వన్డేల్లో విజయవంతమైన ఛేదనల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ (14 సెంచరీలు) పేరిట ఉన్న రికార్డును కెప్టెన్ కోహ్లీ (15 సెంచరీలు) అధిగమించాడు.

భారత్ Vs ఇంగ్లాండ్ వన్డే సిరిస్ ఫోటోలు

463 వన్డేలాడి సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను అందుకోగా విరాట్ కోహ్లీ కేవలం 177వ వన్డేలోనే ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. మరోవైపు రెండో ఇన్నింగ్స్‌లో సచిన్‌ టెండూల్కర్‌తో సమానంగా విరాట్ కోహ్లీ 17 సెంచరీలు సాధించాడు. సచిన్‌ టెండూల్కర్ 232 ఇన్నింగ్స్‌లాడితే కోహ్లి 96వ ఇన్నింగ్స్‌లోనే సాధించాడు.

మూడు ఫార్మెట్లకు కెప్టెన్సీ బాధ్యతలు

పూణె వన్డేతో మూడు ఫార్మెట్లకు కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న విరాట్ కోహ్లీ 105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 122 పరుగులతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో 108 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 122 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.

కోహ్లీకిది వన్డేల్లో 27వ సెంచరీ

కోహ్లీకిది వన్డేల్లో 27వ సెంచరీ

కోహ్లీకిది వన్డేల్లో 27వ సెంచరీ. అంతేకాదు, ల‌క్ష్య ఛేద‌న‌లో 17 సెంచ‌రీలు చేసి ఇప్పటివరకు స‌చిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లీ స‌మం చేశాడు. తాజా సెంచరీతో వన్డే సెంచరీల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్ధానంలో నిలిచాడు.

జయసూర్య రికార్డుకుకేవలం ఒక్క సెంచరీ

జయసూర్య రికార్డుకుకేవలం ఒక్క సెంచరీ

వన్డేల్లో శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య 28 సెంచరీలకు కోహ్లీ కేవలం ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సచిన్ 49 సెంచరీలతో మొదటి స్ధానంలో నిలవగా, రికీ పాంటింగ్ 30, జయసూర్య 28లతో ఉన్నారు.

వన్డేల్లో విజయవంతమైన ఛేదనలో అత్యధిక సెంచరీలు:

వన్డేల్లో విజయవంతమైన ఛేదనలో అత్యధిక సెంచరీలు:

వన్డేల్లో విజయవంతమైన ఛేదనలో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ (14 సెంచరీలు) పేరిట ఉన్న రికార్డును కెప్టెన్ కోహ్లీ (15 సెంచరీలు) అధిగమించాడు.

15 - Virat Kohli (60 innings)

14 - Sachin Tendulkar (124)

9 - Saeed Anwar (59), Tillakaratne Dilshan (60), Sanath Jayasuriya (103).

ఛేదనలో అత్యధిక సెంచరీలు:

ఛేదనలో అత్యధిక సెంచరీలు:

ల‌క్ష్య ఛేద‌న‌లో 17 సెంచ‌రీలు చేసి ఇప్పటివరకు స‌చిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లీ స‌మం చేశాడు.

17 - Virat Kohli (96 innings), Sachin Tendulkar (232 innings)

11 - Tilakratne Dilshan (116 innings)

11 - Chris Gayle (139 innings).

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+