Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS AUS Semifinal: ద్రవిడ్ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్.. ఆనందంతో విరాట్ కోహ్లీ భాంగ్రా డ్యాన్స్!

IND VS AUS Semifinal: టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న కీలక సెమీ ఫైనల్ పోరులో అదరగొట్టాడు.ఈ కీలక పోరులో అతుడు బ్యాటర్ గా కాకుండా ఫీల్డర్ గా ఓ మైలురాయిని అందుకున్నాడు. ఓ అదిరే క్యాచ్ తో రాహుల్ ద్రవిడ్ ను అధిగమించి సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు.

రవీంద్ర జడేజా బౌలింగ్ వేసిన 27వ ఓవర్ లో చివరికి బంచికి జోష్ ఇంగ్లిస్ (11) ఔటయ్యాడు. అతడు బాదిన బంతి నేరుగా కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ చేతికి చిక్కింది. తద్వారా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ప్లేయర్ గా నిలిచాడు. ఈ క్యాచ్ తో అతడు ఇప్పటి వరకు 335 క్యాచులు అందుకున్నాడు. అలానే 334 క్యాచులతో ఉన్న రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.

Kohli breaks rahul dravid most number of catches records in ind vs aus champions trophy 2025 semifinal

కోహ్లీ డ్యాన్స్
మైదానంలో ఎంత దూకుడుగా ఆడతాడో, తన ఫన్నీ చర్యలతో అంతే ఎంటర్‌టైన్మెంట్ కూడా చేస్తాడు విరాట్ కోహ్లీ. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి సెమీ ఫైనల్ లో మరోసారి డ్యాన్సర్‌ అవతారం ఎత్తాడు. తన డ్యాన్సింగ్‌ మూమెంట్స్‌తో అభిమానులను అలరించాడు. మైదానంలో తనకిష్టమైన భాంగ్రా డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ వీటిని చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు.

Story first published: Tuesday, March 4, 2025, 17:31 [IST]
Other articles published on Mar 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+