కోహ్లీ ఫ్లయింగ్ కిస్, అనుష్క శర్మ హంగామా (పిక్చర్స్)
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో జరిగిన భారత్, శ్రీలంక మూడో వన్డే చూసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పాటు స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా వచ్చారు. కొన్నాళ్లుగా కోహ్లీతో కలిసి అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే.
ఆదివారం మ్యాచ్‌కు ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను ఆసక్తిగా చూసింది. కోహ్లీ షాట్లు కొట్టినప్పుడల్లా కేరింతలు కొట్టింది. చతురంగ డిసిల్వా బౌలింగులో కోహ్లీ సిక్సర్ బాది అర్ధ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత వేగంగా ఆరువేల మైలురాయి దాటిన ఆటగాడిగా రికార్డు అందుకున్నాడు.
ఈ సమయంలో అనుష్క లేచి నిలబడి చప్పట్లతో కోహ్లీని అభినందించింది. ఆ సమయంలో విరాట్ కూడా అనుష్క వైపు బ్యాట్ చూపిస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. కోహ్లీ తన బ్యాట్ పైన ముద్దు పెట్టి, దానిని అనుష్క వైపు చూపించాడు. ఇది అందరినీ అలరించింది.
కోహ్లీ ఫాస్టెస్ట్ 6000
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 6 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 144 వన్డేల్లో 136 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా 50వ రన్ సాధించి 6 వేల క్లబ్‌లో చేరాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు విండీస్ గ్రేట్ వివ్ రిచర్డ్స్ (141 ఇన్నింగ్స్) పేరిట ఉండేది.

అనుష్క శర్మ
ఉప్పల్ స్టేడియంలో జరిగిన భారత్, శ్రీలంక మూడో వన్డే చూసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పాటు స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా వచ్చారు.

క్రికెట్
ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన భారత్, శ్రీలంక మూడో వన్డే చూసేందుకు వచ్చిన అభిమానులు ప్లకార్డులు చూపిస్తూ ఆనందించిన దృశ్యం.

క్రికెట్
ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన భారత్, శ్రీలంక మూడో వన్డే చూసేందుకు వచ్చిన అభిమానులు ప్లకార్డులు చూపిస్తూ ఆనందించిన దృశ్యం.

క్రికెట్
శ్రీలంకపై టీమిండియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. హ్యాట్రిక్‌తోపాటు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.

క్రికెట్
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మిగతా రెండు మ్యాచ్‌లను నామమాత్రపు పోరుగా మార్చేసింది.

క్రికెట్
రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో జట్టుకు నాయకత్వం వహిస్తున్న యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ 32వ అర్ధ సెంచరీ సాధించి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

క్రికెట్
శ్రీలంక మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మన్ మహేల జయవర్ధనే వీరోచిత పోరాటం, 17వ వనే్డ సెంచరీ వృథాకాగా, భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీని చేజార్చుకున్నాడు.

క్రికెట్
తెలుగు తేజం అంబటి రాయుడు రనౌటైన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 48.2 ఓవర్లలో 242 పరుగులకే ఆలౌట్‌కాగా, భారత్ 44.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 245 పరుగులు సాధించింది.

క్రికెట్
ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించి, సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీనితో ఈనెల 13న కోల్‌కతాలో, 16న రాంచీలో జరిగే చివరి రెండు వనే్డలకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండాపోయింది.

క్రికెట్
శ్రీలంకపై మరో విజయాన్ని నమోదు చేసే ఊపుమీద ఉన్న టీమిండియాకు ఆజింక్య రహానే, శిఖర్ ధావన్ మంచి ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు.

క్రికెట్
అయితే, మొదటి వికెట్‌కు 62 పరుగులు జత చేసిన తర్వాత తిసర పెరెరా బౌలింగ్‌లో జయవర్ధనే క్యాచ్ పట్టడంతో రహానే ఇన్నింగ్స్ ముగిసింది.

క్రికెట్
అతను 47 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లతో 31 పరుగులు చేశాడు. స్థానిక ఆటగాడు, రెండో వనే్డ సెంచరీ హీరో అంబటి రాయుడు 46 బంతుల్లో 35 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు.

క్రికెట్
131 పరుగుల వద్ద రెండో వికెట్ కూలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 9.3 ఓవర్లలో 70 పరుగులు జోడించిన ధావన్ దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తి చేయకుండానే అవుటయ్యాడు.

క్రికెట్
కోహ్లీతో కలిసి భారత్ స్కోరును 200 పరుగుల మైలురాయిని దాటించిన అతను 79 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 91 పరుగులు చేసి సంగక్కర క్యాచ్ అందుకోగా కులశేఖర బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

క్రికెట్
అప్పటికే భారత్ విజయం ముంగిట నిలిచింది. ప్రియంజన్ బౌలింగ్‌లో బంతిని బౌండరీకి తరలించిన వృద్ధిమాన్ సాహా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

క్రికెట్
మరో 35 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించే సమయానికి రైనా 18, సాహా 6 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.

క్రికెట్
శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే తన క్రికెట్ కెరీర్‌లో అరుదైన మైలురాయిని దాటాడు. భారత్‌తో ఆదివారం ఇక్కడ జరిగిన మూడో వన్డే ఇంటర్నేషనల్‌లో శతకాన్ని సాధించిన అతను ఈ ఫార్మెట్‌లో 12,000 పరుగులను పూర్తి చేశాడు.

క్రికెట్
426వ వన్డే మ్యాచ్ ఆడుతున్న అతని ఖాతాలో ఇప్పుడు 12,002 పరుగులున్నాయి. కెరీర్‌లో అతనికి 17 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు సాధించాడు.

క్రికెట్
ఈ జాబితాలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ (463 మ్యాచ్‌ల్లో 18,426 పరుగులు), రికీ పాంటింగ్ (375 మ్యాచ్‌ల్లో 13,704 పరుగులు), సనత్ జయసూర్య (445 మ్యాచ్‌ల్లో 13,430 పరుగులు), కుమార సంగక్కర (383 మ్యాచ్‌ల్లో 12,918 పరుగులు) ఈ జాబితాలో జయవర్ధనే కంటే ముందున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications