గూగుల్ సెర్చ్‌లో కోహ్లీ టాప్: సానియాకు 7వ ప్లేస్
ముంబై: భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. గుగూల్ ఇండియాలో 2015లో అత్యధికులు సెర్చ్ చేసిన క్రీడాకారుడిగా ఆయన నిలిచాడు. నిరుడు అడిలైడ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ కావడంతో కోహ్లీ భారత టెస్టు క్రికెట్ జట్టు సారథ్యాన్ని తీసుకున్నాడు.
బార్సిలోనా స్టార్ లియోనెల్ మెస్సీ కన్నా కోహ్లీ కాస్తా టాప్‌లో ఉన్నాడు. కోహ్లీ టాప్‌లో నిలువుగా, మెస్సీ రెండో స్థానంలో నిలిచాడు. టాప్ టెన్ క్రీడాకారుల జాబితాను గూగుల్ బుధవారంనాడు విడుదల చేసింది. టాప్ టెన్‌లో భారత క్రికెటర్లు స్థానం సంపాదించుకున్నారు. సచిన్ టెండూల్కర్ మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియా ట్వంటీ20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాలుగో స్తానంలో నిలిచాడు.

క్రిస్టినో రొనాల్డో ఐదో స్థానంలో నిలిచాడు. టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ 2015లో పెద్దగా విజయాలు సాధించనప్పటికీ ఆరో స్తానంలో నిలిచాడు.
జాబితాలో క్రికెట్‌కు సంబంధం లేని ఏకైక ప్లేయర్ సానియా మీర్జా ఏడో స్థానంలో నిలిచింది. సానియా 2015లో రెండు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకుంది. మార్టినా హింగిస్‌తో కలిసి మొత్తం 9 టైటిళ్లు సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications