విజయగర్వంతో దక్షిణాఫ్రికా పర్యటనపై విరాట్ కోహ్లీ ముందు చూపు
హైదరాబాద్: విదేశీ పర్యటనల్లో కూడా టీమిండియా ఇదే ప్రదర్శన చేయాలని రెండో టెస్టు విజయానంతరం కెప్టెన్ కోహ్లీ మీడియాతో పేర్కొన్నాడు. 'నేనిలాగే బ్యాటింగ్ చేయాలని ఆశిస్తున్నా. త్వరగా క్రీజులో నిలదొక్కుకొని చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు చేస్తే మా బౌలర్లకు తగినంత సమయం దొరుకుతుంది. విదేశీ పర్యటనల్లోనూ మేము ఇదే పద్ధతిని అనుసరించాలి' అని కోహ్లీ అన్నాడు.

భారీ సెంచరీలు చేయాలనుకుంటా
'జట్టు ప్రయోజనం కోసమే భారీ సెంచరీలు చేయాలనుకుంటా. సెంచరీ అనంతరం నిలకడగా ఆడకపోతే వెంటనే రెండు వికెట్లు పడొచ్చు. కొత్త బ్యాట్స్‌మన్ కన్నా క్రీజులో నిలదొక్కుకున్న ఆటగాడు మంచి షాట్లు ఆడగలడు. ఇందులో భాగంగానే నేను ఎక్కువ సమయం క్రీజులో ఉంటా. దీనికి నా ఫిట్‌నెస్ ఎంతగానో సహకరిస్తుంది' అని కోహ్లీ అన్నాడు.

పుజారాపై కోహ్లీ ప్రశంసలు
టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న పుజారాపై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘పుజారా నిలకడగా ఆడతున్నాడు. ఇది జట్టుకు ఎంతగానో కలిసొస్తుంది. చాలా రోజుల తర్వాత మురళీ విజయ్ చక్కగా ఆడాడు. ఇక, రెండో టెస్టులో సెంచరీ సాధించిన రోహిత్ కూడా భవిష్యత్తులో టెస్టుల్లో తాను మంచి పోటీదారు అని నిరూపించుకున్నాడు' అని కోహ్లీ తెలిపాడు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రాణించడం వల్లే
'జట్టు కోసం ఇటీవలి కాలంలో భువీ చాలా ఎక్కువగా క్రికెట్ ఆడాడు. ఇషాంత్, షమి, ఉమేశ్ ఎక్కువగా ఆడకున్నా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడటం వల్లే అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక నాగ్ పూర్ వికెట్ రెండో రోజు నుంచి మారిపోయింది. అయితే కోల్‌కతా వికెట్ మాత్రం అచ్చం దక్షిణాఫ్రికా పిచ్‌లను పోలి ఉంది' అని కోహ్లీ చెప్పాడు.

బ్యాట్స్‌మెన్ విఫలం కావడం వల్లే
ఇక బ్యాట్స్‌మెన్ విఫలం కావడం వల్లే రెండో టెస్టులో ఓటమి పాలయ్యామని శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ అన్నాడు. 'టాస్ గెలిచాం. దురదృష్టవశాత్తు మేం తొలి రోజే వెనకబడ్డాం. మా బ్యాట్స్‌మెన్ మరోసారి విఫలమయ్యారు. భారత్‌పై గెలవాలన్నా, కనీసం ఐదు రోజులు ఆడాలన్నా 350 పరుగులన్నా చేయాలి. మేమిక్కడికి రాకముందు శుభారంభాలు ఆశించాం. కానీ ఓపెనర్లు 50-60 పరుగులకే ఔటయ్యారు. వారు నేర్చుకుంటారని ఆశిస్తున్నా' అని చండీమాల్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications