Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kohli 300th ODI: 11 పరుగులే.. అయినా చరిత్ర సృష్టించిన కోహ్లీ - ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా తన కెరీర్ లో 300వ వన్డే మ్యాచ్ ఆడి రికార్డుకెక్కాడు. కెరీర్ మొత్తంగా జాతీయ జట్టు తరఫున 300 వన్డే మ్యాచులు ఆడిన అతి తక్కువ మంది ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అయితే ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ (11) ఈ మ్యాచ్ లో తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఇదే సమయంలో అతడు నిరాశపరిచినప్పటికీ.. ఈ 300వ వన్డే మ్యాచ్ ఆడడంతో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించాడు.

తొలి ప్లేయర్ గా ఘనత..
కివీస్ పై కోహ్లీకి ఇది 200వ వన్డే మ్యాచ్ కాగా, ఓవరాల్ గా 300వ వన్డేలు ఆడిన భారత ఏడో బ్యాటర్ గా, మొత్తంగా 18వ క్రికెటర్ గా నిలిచాడు. అయితే ఈ 18 మంది క్రికెటర్లతో ఒక్కరూ కూడా మిగితా ఫార్మట్లు టీ20, టెస్టుల్లో జాతీయ జట్టు తరఫున 100 మ్యాచులు ఆడలేదు. కానీ వీరిలో విరాట్ మాత్రం 300 వన్డేలతో పాటు 100 టీ20లు, 100 టెస్ట్ మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్ గా చరిత్ర కెక్కాడు.

Kohli 300th ODI becomes first player to play 100 tests 100 t20s in ind vs Nz champions trophy 2025

300 వన్డేలు ఆడిన ఆటగాళ్లు వీరే..

షాహిద్ అఫ్రిది : 398
ఇంజమామ్-ఉల్-హక్ : 378
రికీ పాంటింగ్ : 375
వసీం అక్రమ్ : 356
ఎంఎస్ ధోనీ : 350
ఎం మురళీధరన్ : 350
రాహుల్ ద్రవిడ్ : 344
అజారుద్దీన్: 334
టి దిల్షాన్ : 330
జాక్వెస్ కల్లిస్ : 328
స్టీవ్ వా : 325
చమిందా వాస్ : 322
సౌరవ్ గంగూలీ : 311
అరవింద డి సిల్వా : 308
యువరాజ్ సింగ్ : 304
షాన్ పొల్లాక్ : 303
క్రిస్ గేల్ : 301
విరాట్ కోహ్లీ : 300*

Story first published: Sunday, March 2, 2025, 17:11 [IST]
Other articles published on Mar 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+