Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kohli 100th Test: ఏంది రోహిత్ అన్న ఇది.. ఇట్లైతే ఎట్లా! మ‌ళ్లీ అదే త‌ప్పు చేసిన హిట్‌మ్యాన్‌

Kohli 100th Test: Rohit Sharma out gets a full shot off a short pitch ball .. Cricket Analysts Critics
Virat Kohli 100th Test: Team India Success Mantra Kohli | IND v SL | Oneindia Telugu

మొహాలీ: భార‌త్‌, శ్రీ‌లంక మ‌ధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నిరాశ‌ప‌రిచాడు. మ‌రోసారి త‌న వీక్ నెస్ పాయింట్‌ను బ‌య‌ట‌పెట్టుకున్నాడు. క్రీజులో కుదురుకున్నాక అన‌వ‌స‌ర‌మైన దూకుడుతో ఫుల్ షాట్‌కు ప్ర‌య‌త్నించి మ‌రోసారి బౌండ‌రీ లైన్ వ‌ద్ద దొరికిపోయాడు. దీంతో హిట్‌మ్యాన్ ఆట‌తీరుపై అభిమానుల‌తోపాటు క్రికెట్ విశ్లేష‌కులు మండిప‌డుతున్నారు.

 ఆత్మ‌విశ్వాసంతో బ్యాటింగ్‌

ఆత్మ‌విశ్వాసంతో బ్యాటింగ్‌

తొలి టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ ఆరంభం నుంచి ధాటిగానే ఆడాడు. ఈ క్ర‌మంలో క్రీజులో కుదురుకున్నాడు. వ‌రుస‌గా బౌండ‌రీలు బాదుతూ స‌మ‌యోచితంగా ప‌రుగులు రాబ‌ట్టాడు. ఆత్మ‌విశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. దీంతో కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాలి. ఈ క్ర‌మంలో ల‌హిరు కుమ‌రా వేసిన ప‌దో ఓవ‌ర్లో షార్ట్ పిచ్ బంతుల‌ను హిట్‌మ్యాన్ వ‌రుస‌గా త‌న ఫెవ‌రేట్ ఫుల్ షాట్ల‌తో రెండు ఫోర్లు బాదాడు. ఆ త‌ర్వాతి బంతి డాట్ అయింది.

దూకుడుతో ఔట్

దూకుడుతో ఔట్

అప్ప‌టికే ఆ ఓవ‌ర్‌లో తొమ్మిది ప‌రుగులు కూడా వ‌చ్చాయి. కానీ ఈ క్ర‌మంలో హిట్‌మ్యాన్ మ‌రోసారి దూకుడుకు పోయాడు. షార్ట్ పిచ్‌గా వ‌చ్చిన బంతిని మ‌ళ్లీ ఫుల్ షాట్‌కు ప్ర‌య‌త్నించాడు. కానీ ఈ సారి రోహిత్ టైమింగ్ మిస్స‌యింది. కుమార తెలివిగా స్లోగా వేసిన షార్ట్ పిచ్ బంతిని ఫుట్ షాట్ ఆడి బౌండ‌రీ లైన్ వ‌ద్ద ల‌క్మ‌ల్‌కు దొరికిపోయాడు. దీంతో 28 బంతుల్లోనే 29 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద రోహిత్ శ‌ర్మ ఇన్నింగ్స్ ముగిసింది. హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు ఉన్నాయి.

గ‌తంలోనూ ఇదే త‌ప్పు

గ‌తంలోనూ ఇదే త‌ప్పు

రోహిత్ శ‌ర్మ ఇలా దూకుడుతో షార్ట్ పిచ్ బంతిని ఫుల్ షాట్‌గా ఆడి ఔట‌వ్వ‌డం ఇది కొత్తేం కాదు. గ‌తంలోనే అనేక మ్యాచ్‌ల్లో క్రీజులో చ‌క్క‌గా కుదురుకున్నాక దూకుడుతో ఫుట్ షాట్ ఆడి ఔట‌య్యాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో హిట్‌మ్యాన్ ఎక్కువ‌గా ఇదే త‌ర‌హా బంతుల‌కు ఔట‌య్యాడు. రోహిత్ బ‌ల‌హీన‌త‌ను అర్థం చేసుకున్న ప్ర‌త్య‌ర్థి కెప్టెన్లు కూడా బౌల‌ర్ల‌తో షార్ట్ పిచ్ బంతులు వేయిస్తూ బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డ‌ర్ల‌ను పెట్టి రోహిత్‌ను ఔట్ చేస్తున్నాడు.

 రోహిత్‌పై విమ‌ర్శ‌లు

రోహిత్‌పై విమ‌ర్శ‌లు

రోహిత్ శ‌ర్మ ఇలా ప‌దే ప‌దే అదే త‌ప్పును చేస్తూ ఔట‌వ‌డంపై క్రికెట్ విశ్లేష‌కుల‌తోపాటు అభిమానులు మండిప‌డుతున్నారు. హిట్‌మ్యాన్ త‌న బ్యాటింగ్ తీరును మార్చుకోవాల‌ని సూచిస్తున్నారు. మ‌రి కొంద‌రైతే ఏంది రోహిత్ అన్న ఇది ప‌దే ప‌దే అదే త‌ర‌హా షాట్‌కు ఔట్ అయితే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. రోహిత్ స‌మ‌యోచితంగా ఆడుతూ రాణించాల‌ని, దూకుడును తగ్గించుకోవాల‌ని చెబుతున్నారు. అయితే గ‌తంలోనే హిట్‌మ్యాన్ ఈ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టాడు. తాను భారీ స్కోర్ చేసిన‌ప్పుడు ఇదే త‌ర‌హా షాట్ల‌తో ఆ ప‌రుగులు రాబ‌ట్టాన‌ని గుర్తు చేశాడు.

Story first published: Friday, March 4, 2022, 11:43 [IST]
Other articles published on Mar 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+