Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kohli 100th Test: కోహ్లీ.. కోహ్లీ.. కోహ్లీ నినాదాల‌తో మార్మోగిన మొహాలీ స్టేడియం.. వీడియో వైర‌ల్‌!

Kohli 100th Test: Mohali Stadium during the first Test match between India and Sri Lanka was filled with slogans by Virat Kohli.
Virat Kohli 100th Test: Team India Success Mantra Kohli | IND v SL | Oneindia Telugu

మొహాలీ: శ్రీ‌లంక‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌తో టీమిండియా వెట‌ర‌న్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ కెరీర్లో 100 టెస్ట్ మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో 100 టెస్టులు 12వ భారత ఆటగాడిగా, ప్రపంచవ్యాప్తంగా 71వ ఆటగాడిగా నిలిచాడు. అయితే మ‌యాంక్ అగ‌ర్వాల్ ఔట‌వ్వ‌గానే విరాట్‌ కోహ్లీ మైదానంలోకి రావ‌డంతో మొహాలీ స్టేడియం అంతా కోహ్లీ నినాదాలతో మార్మోగింది. అలాగే కోహ్లీ మైదానంలోకి వ‌స్తున్న స‌మ‌యంలో అభిమానులు లేచి నిలబడి చ‌ప్ప‌ట్ల‌తో విరాట్ కోహ్లీని ఆహ్వానించారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ మారింది. మ్యాచ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచే మైదానం మొత్తంలో విరాట్ కోహ్లీ నినాదాలు వినిపించాయి. 100వ టెస్టు మ్యాచ్ సంద‌ర్భంగా కోహ్లీకి శుభాకాంక్ష‌లు చెబుతూ మైదానంలో అభిమానులు ప్ల‌కార్డుల‌ను ప్ర‌దర్శించారు. కాగా ఈ టెస్ట్ మ్యాచ్‌కు బీసీసీఐ 50 శాతం మంది ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ ప్రారంభానికి ముందు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ జ‌ట్టు స‌భ్యులు అంద‌రితో క‌లిసి వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న విరాట్ కోహ్లీకి 100వ టెస్ట్‌ క్యాప్‌తో కూడిన స్పెష‌ల్ మెమెంటోను అందించాడు. ఆ స‌మ‌యంలో విరాట్ కోహ్లీతోపాటు అత‌ని స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ కూడా ఉంది. అలాగే కోహ్లీ సోదరుడు, ఇతర కుటుంబంలో స్టేడియంలో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా బీసీసీఐకి, టీమ్ మెంట్స్‌కు కోహ్లీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా చాలా కాలం త‌ర్వాత వెట‌ర‌న్ బ్యాట‌ర్లు చ‌టేశ్వ‌ర్ పుజారా, అజింక్యా ర‌హానే లేకుండా ఆడ‌డం గ‌మ‌నార్హం.

కాగా తొలి రోజు ఆట‌లో భోజ‌న విరామ స‌మ‌యానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 109 ప‌రుగులు చేసింది. క్రీజులో 30 ప‌రుగుల‌తో హ‌నుమ విహారీ, 15 ప‌రుగుల‌తో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అంత‌కు ముందు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, మ‌యాంక అగ‌ర్వాల్ టీమిండియా ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. అంత‌కు ముందు ఓపెన‌ర్లు మయాంక్ అగ‌ర్వాల్ 33, రోహిత్ శ‌ర్మ 29 ప‌రుగుల‌కు ఔట‌య్యారు.

తుది జ‌ట్లు
శ్రీలంక: దిముత్ కరుణరత్నే(కెప్టెన్‌), లహిరు తిరిమన్నె, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీప‌ర్), సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా, లహిరు కుమార.

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Friday, March 4, 2022, 12:47 [IST]
Other articles published on Mar 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+