For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kohli 100th Test Lunch Break: ధాటిగా ఆరంభించిన భార‌త్‌.. లంక‌కు 2 వికెట్లు.. క్రీజులో విహారీ, కోహ్లీ

Kohli 100th Test Lunch Break: India Score 109-2.. Hanuma vihari (30*), Virat kohli (15*)
IND VS SL 1st Test: Mohali రికార్డులు Team India పూర్తి అధిప‌త్యం |Kohli 100th Test| OneindiaTelugu

మొహాలీ: శ్రీ‌లంక‌తో తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట‌లో భోజ‌న విరామ స‌మ‌యానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 109 ప‌రుగులు చేసింది. క్రీజులో 30 ప‌రుగుల‌తో హ‌నుమ విహారీ, 15 ప‌రుగుల‌తో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అంత‌కు ముందు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, మ‌యాంక అగ‌ర్వాల్ టీమిండియా ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు.

ఓపెన‌ర్లు శుభారంభం

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌కు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, మ‌యాంక అగ‌ర్వాల్ శుభారంభాన్ని అందించారు. వీరిద్ద‌రు ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెన‌ర్లుగా వీరిద్ద‌రికీ ఇదో రెండో హాఫ్ సెంచ‌రీ భాగ‌స్వామ్యం. ఈ క్ర‌మంలో 9.5 ఓవ‌ర్ల‌లో జ‌ట్టు స్కోర్ 52 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 28 బంతుల్లోనే 29 ప‌రుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఔట‌య్యాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు ఉన్నాయి. ల‌హిరు కుమార బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించిన రోహిత్ బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఉన్న ల‌క్మ‌ల్‌కు దొరికిపోయాడు. కాగా కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌కు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం.

మ‌యాంక్ ఔట్

మ‌యాంక్ ఔట్

ఈ క్ర‌మంలో మ‌రో ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ హ‌నుమ విహారీతో క‌లిసి ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు. ఈ క్ర‌మంలో జ‌ట్టు స్కోర్ 80 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా.. 49 బంతుల్లో 33 ప‌రుగులు చేసిన మ‌యాంక్ అగ‌ర్వాల్.. లసిత్ ఎంబుల్దేనియా బౌలింగ్‌లో ఎల్బీగా ఔట‌య్యాడు. దీంతో 80 ప‌రుగుల వ‌ద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. మయాంక్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు ఉన్నాయి.

కోహ్లీ వందో టెస్ట్‌

కోహ్లీ వందో టెస్ట్‌

అనంత‌రం కెరీర్లో వందో టెస్ట్ మ్య‌చ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ క్రీజులోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో హ‌నుమ విహారీ, విరాట్ కోహ్లీ క‌లిసి ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించారు. లంచ్ బ్రేక్ స‌మ‌యానికి మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డి జ‌ట్టు స్కోర్‌ను 100 ప‌రుగులు దాటించారు. మ్యాచ్‌కు ముందు వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీకి హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ 100వ టెస్ట్ మ్యాచ్ క్యాప్‌ను స్పెష‌ట్ మెమెంటోగా అందించాడు.

 తుది జ‌ట్లు

తుది జ‌ట్లు

శ్రీలంక: దిముత్ కరుణరత్నే(కెప్టెన్‌), లహిరు తిరిమన్నె, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీప‌ర్), సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా, లహిరు కుమార.

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Friday, March 4, 2022, 12:11 [IST]
Other articles published on Mar 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+