Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kohli 100th Test: షేన్‌వార్న్ మృతి ప‌ట్ల ఇండియా, శ్రీ‌లంక ఆట‌గాళ్లు సంతాపం.. నిమిషం పాటు మౌనం

Kohli 100th Test: India and Sri Lanka players observe a minute of silence over legendary cricketer Shane Warnes death

మొహాలీ: ఇండియా, శ్రీ‌లంక తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ప్రారంభ‌మైంది. ఆట ప్రారంభానికి ముందు శుక్ర‌వారం మృతి చెందిన దిగ్గ‌జ స్పిన్న‌ర్ షేన్ వార్న్ మృతి ప‌ట్ల ఇరు జ‌ట్ల ఆట‌గాళ్ల‌తోపాటు స‌పోర్టింగ్ స్టాఫ్ సంతాపం పాటించారు. షేన్‌వార్న్‌కు మృతికి సంతాపంగా ఒక నిముషం పాటు మౌనం పాటించారు. అనంత‌రం మ్యాచ్ ప్రారంభించారు. అలాగే ఆట‌గాళ్లంతా చేతుల‌కు న‌ల్ల బ్యాడ్జ్‌ల‌ను ధ‌రించి మ్యాచ్ ఆడుతున్నారు. అనంత‌రం ప్రారంభ‌మైన మ్యాచ్‌లో శుక్ర‌వారం ఆటముగిసే స‌మయానికి 45 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచిన ర‌వీంద్ర జ‌డేజా హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్లో జ‌డేజాకు ఇది 18వ హాఫ్ సెంచ‌రీ.

కాగా ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గ‌జం షేన్‌వార్న్ శుక్ర‌వారం హాఠాన్మ‌రణం చెందిన సంగ‌తి తెలిసిందే. థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో అచేత‌న స్థితిలో ప‌డి ఉన్న వార్న్‌‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. ఆస్ప‌త్రికి చేరుకునే లోపే వార్న్ ప్రాణాలు విడిచారు. 52 ఏళ్ల వార్న్ మృతితో క్రికెట్ ప్ర‌పంచం శోక సంద్రంలో మునిగిపోయింది. వార్న్ మృతికి క్రీడా లోకం సంతాపం ప్ర‌క‌టించింది.

భార‌త ఆట‌గాళ్లు స‌చిన్ టెండూల్క‌ర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్, సౌర‌వ్ గంగూలీ, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ త‌దిత‌రులు షేన్ వార్న్ మృతికి సంతాపం తెలిపారు. 15 ఏళ్ల అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్లో షేన్ వార్న్ ఎన్నో మైలు రాళ్ల‌ను సాధించారు. త‌న లెగ్ స్పిన్‌తో బ్యాట‌ర్ల‌ను ముప్ప తిప్పలు పెట్టారు. స్పిన్ బౌలింగ్ అంటే షేన్ వార్నే అనేంత‌గా క్రికెట్‌ను ఎలారు.

కెరీర్లో 145 టెస్టు మ్యాచ్‌లు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు తీశాడు. ఇక 194 వ‌న్డే మ్యాచ్‌ల్లో 293 వికెట్లు తీశాడు. 55 టీ20 మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీశాడు. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి వెయ్యి వికెట్ల‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన వార్న్ తొలి సీజ‌న్‌లోనే ఆ జ‌ట్టును ఛాంపియ‌న్‌గా నిల‌బెట్టాడు.

Story first published: Saturday, March 5, 2022, 10:24 [IST]
Other articles published on Mar 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+