న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనుచిత వ్యాఖ్యలు: పాండ్యా, రాహుల్‌లకు అంబుడ్సమన్ విధించిన శిక్ష ఎంటో తెలుసా!

Hardik Pandya,KL Rahul Punished By BCCI With 20 Lakh Rupees Each || Oneindia Telugu
Koffee With Karan fiasco: Hardik Pandya, KL Rahul fined Rs 20 lakh each by BCCI ombudsman

హైదరాబాద్: 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లకు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ భారీ జరిమానా విధించారు. ఇద్దరూ రూ. 20లక్షలు చొప్పున జరిమానా చెల్లించాలంటూ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

విధి నిర్వహణలో అమరులైన

విధి నిర్వహణలో అమరులైన 10 మంది పారా మిలటరీ అమర జవానుల కుటుంబాలకు రూ.1లక్ష చొప్పున చెల్లించాలని, మిగిలిన రూ.10 లక్షలు అంధుల క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రచారఖర్చుల నిమిత్తం విరాళంగా ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తాన్ని నిర్దేశించిన నాలుగు వారాల్లోపు చెల్లించాలని అన్నారు.

జరిమానా చెల్లించకుంటే

జరిమానా చెల్లించకుంటే

ఒకవేళ జరిమానా చెల్లించకుంటే వీరికి ఇచ్చే మ్యాచ్‌ ఫీజులోంచి బీసీసీఐ తీసుకోవాలని అంబుడ్స్‌మన్‌ ఆదేశించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధంతరంగా వచ్చేసిన కారణంగా ఇప్పటికే ఈ ఇద్దరూ రూ.30 లక్షల చోప్పున ఆదాయం కోల్పోయారని ఆయన అన్నారు.

దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న వీరు

దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న వీరు

దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న వీరు రోల్‌ మోడల్స్‌గా ఉండాలని, వారి ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇద్దరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్న ఆయన... వారు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని బీసీసీఐ అంబుడ్సమన్ డీకే జైన్ ఆదేశించారు.

Story first published: Saturday, April 20, 2019, 14:46 [IST]
Other articles published on Apr 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X