For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కాఫీ విత్ కరణ్: ఈషా గుప్తాతో డేటింగ్‌పై పాండ్యా స్పందన ఇది!

Hardik Pandya Open Up On Dating With Esha Guptha | Oneindia Telugu
Koffee With Karan 6: KL Rahul crushed on Malaika before she dated Arjun, Hardik Pandya tells parents when he’s had sex

హైదరాబాద్: బాలీవుడ్ నటి ఈషా గుప్తాతో తాను డేటింగ్‌లో ఉన్నానంటూ వచ్చిన వార్తలపై తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్‌ కరణ్‌' కార్యక్రమానికి పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి అడగ్గా తనదైన శైలిలో జవాబిచ్చాడు. "నేను ఈ మధ్యకాలంలో మూడు విషయాలను తెలుసుకున్నా. మొదటి విషయం ఏంటంటే.. ఒక అమ్మాయిని చూడటం. రెండోది డేటింగ్‌. మూడోది రిలేషన్‌షిప్‌" అని చెప్పుకొచ్చాడు.

"ఇప్పటి వరకు ఈ మూడూ ఒకటేనేమో అనుకునేవాడిని. కానీ మొదటి రెండు విషయాల్లో కమిట్‌మెంట్‌ అవసరం లేదని.. రిలేషన్‌షిప్‌లో కమిట్‌మెంట్‌ చాలా అవసరమని తెలుసుకున్నా" అని పాండ్యా వెల్లడించాడు. గతంలో బాలీవుడ్‌ హీరోయన్లు ఎల్లీ అవ్రామ్‌, పరిణీతి చోప్రాతోనూ పాండ్యా డేటింగ్‌ చేశాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, షా గుప్తా విషయంలో మాత్రం పాండ్యా చాలా సీరియస్‌గా ఉన్నాడని, ఆమెను పెళ్లిచేసుకోబోతున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. వీటిపై పాండ్యా గతంలో సోషల్ మీడియాలో "నేను ఒకరితో డేటింగ్‌లో ఉన్నప్పుడు అతడిని పెళ్లిచేసుకోవాలా? వద్దా? అనే విషయాన్ని నాకు వదిలేయండి. ఇప్పటికైతే నాకు ఎలాంటి పెళ్లి ఆలోచనలు లేవు. దయచేసి నా ప్రైవసీకి భగ్నం కలిగించకండి" అని అన్నాడు.

Story first published: Tuesday, January 8, 2019, 12:24 [IST]
Other articles published on Jan 8, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+