సచిన్ టెండూల్కర్ సెంచరీ చేశాడు, ముంబై ఇండియన్స్ ఓడింది

కొచ్చి టస్కర్స్ కేరళ జట్టు ఓపెనర్లు మెక్‌కలమ్, జయవర్దనేలు వ్యూహాత్మకంగా ఆడి, విజయానికి బాటలు వేశారు. మలింగను దెబ్బ కొడితే సగం పని పూర్తయినట్లేనని గ్రహించిన ఈ జోడీ ఆ పనిని సమర్థంగా పూర్తి చేసింది. మూడో ఓవర్లో బ్రెండన్ మూడు ఫోర్లు, జయవర్దనే ఒక ఫోర్ బాదారు. ఆ తర్వాత ఇద్దరూ పొలార్డ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. 2 ఓవర్లలో అతను 30 పరుగులు సమర్పించుకున్నారు. తర్వాతి బాధితుడు హర్భజన్. 3 ఓవర్లలో 28 పరుగులు. మిగిలిన బౌలర్లు కూడా కోచి ఓపెనర్లను అడ్డుకోలేకపోయారు. 13 ఓవర్లలో ఆ జట్టు స్కోరు 116/0. ఈ స్థితిలో కోచి సునాయాసంగా గెలుస్తుందనిపించింది.
అయితే మలింగ జయవర్దనేను ఔట్ చేయడంతో 128 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఐతే మెక్‌కలమ్ ధాటిని కొనసాగించడంతో కోచి విజయానికి చేరువైంది. 18 బంతుల్లో 27 పరుగులు చేయాలి. ఈ దశలో మలింగ.. మెక్‌కలమ్‌ను బౌల్డ్ చేయడంతో ముంబయి మళ్లీ రేసులోకొచ్చింది. కానీ రవీంద్ర జడేజా (25 నాటౌట్; 11 బంతుల్లో 2X4, 2X6), బ్రాడ్ హాడ్జ్ (11; 7 బంతుల్లో 2X4)తో కలిసి కోచికి విజయాన్ని కట్టబెట్టాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications