Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొచి టస్కర్స్ కేరళ హ్యాట్రిక్ విజయం, కెకెఆర్ కెప్టెన్ గంభీర్‌కు షాక్

Kochi Tuskers Kerala
కోల్‌కతా: గౌతం గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొచి టస్కర్స్ కేరళ జట్టు షాక్ ఇచ్చి, హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. 132 పరుగుల (7 వికెట్లకు) లక్ష్యాన్ని ఛేదించేందుకు కోల్‌కతా కడదాకా పోరాడినా ఓటమి తప్పలేదు. నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులే చేయగలిగింది. దీంతో టస్కర్స్‌ 6 పరుగుల తేడాతో గెలిచింది. 40 ఓవర్ల ఆటలో 16 వికెట్లు పడటం విశేషం. 25 పరుగులు చేయడంతోపాటు, చక్కని వ్యూహాలతో జట్టును గెలిపించిన కోచి సారథి జయవర్దనే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. 37 పరుగులకే కలిస్‌ (6), గంభీర్‌ (3), బిస్లా (16)లను పెవిలియన్‌ చేర్చి కోల్‌కతాను ఆత్మరక్షణలోకి నెట్టారు కోచి బౌలర్లు.

ఈ దశలో మనోజ్‌ తివారీ (46; 51 బంతుల్లో 2X4, 2X6) కోల్‌కతాను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశాడు. మోర్గాన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 36 పరుగులు జోడించి గెలుపుపై ఆశలు రేపాడు. ఐతే మోర్గాన్‌ (10) రనౌటవడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. షకిబ్‌ (2) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. వస్తూనే పొవార్‌ బౌలింగ్‌లో ఓ సిక్స్‌ బాదిన యూసుఫ్‌ (8) మ్యాచ్‌ను మలుపు తిప్పేలా కనిపించాడు. ఐతే తర్వాతి బంతినీ సిక్స్‌ కొట్టేందుకు ప్రయత్నించి మురళీధరన్‌ చేతికి చిక్కాడు. వెంటనే వైడ్‌ బంతితో తివారీని బుట్టలో వేశాడు జడేజా. అతను స్టంపౌటవడంతో కోల్‌కతా పరాజయం ఖరారైంది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోచి.. శుభారంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. గత రెండు మ్యాచ్‌ల్లో కోచికి అద్భుత ఆరంభాలిచ్చిన బ్రెండన్‌ మెక్‌కలమ్‌, జయవర్దనేలు ఫామ్‌ను కొనసాగించారు. 6 ఓవర్లలో 45 పరుగులతో కోచి భారీ స్కోరుకు పునాది వేసుకుంది. ఐతే షకిబ్‌ అల్‌హసన్‌ (3/28), యూసుఫ్‌ పఠాన్‌ (3/20)ల జోడీ కోచిని దారుణంగా దెబ్బ తీసింది. షకిబ్‌ ఏడో ఓవర్లో మెక్‌కలమ్‌ (23; 19 బంతుల్లో 2X4, 1X6)ను ఔట్‌ చేసి.. వికెట్ల పతనానికి తెర తీశాడు. తర్వాత యూసుఫ్‌ పఠాన్‌ ఓవర్‌కు ఒకటి చొప్పున వరుసగా మూడు వికెట్లు పడగొట్టాడు.

తన తొలి ఓవర్లోనే (ఇన్నింగ్స్‌ 8వ) జయవర్దనే (25; 27 బంతుల్లో 5X4)ను ఎల్బీగా బలిగొన్న పఠాన్‌ బ్రాడ్‌ హాడ్జ్‌ (2), పార్థివ్‌ పటేల్‌ (9)ల వికెట్లనూ తన ఖాతాలో వేసుకున్నాడు. 49/0తో ఉన్న కోచి 65/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రవీంద్ర జడేజా (29; 18 బంతుల్లో 1X4, 3X6) కోచిని ఆదుకున్నాడు. బాలాజి, యూసుఫ్‌ పఠాన్‌, షకిబ్‌ల బౌలింగ్‌లో సిక్సర్లు బాదిన జడేజా.. కేదార్‌ జాదవ్‌ (12)తో కలిసి స్కోరును వంద పరుగులకు చేర్చాడు. ఐతే మళ్లీ వికెట్ల పతనానికి గేట్లెత్తాడు షకిబ్‌. కేదార్‌ను బౌల్డ్‌ చేశాడు. వెంటనే జడేజా కూడా వెనుదిరిగాడు. గొమెజ్‌ (10 నాటౌట్‌), వినయ్‌కుమార్‌ (11) పోరాడటంతో కోచి ఓ మోస్తరు స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+