మెల్బోర్న్: వెస్టిండీస్ స్టార్ బ్యాట్సుమెన్ క్రిస్ గేల్ పైన వుమనైజర్ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న ఓ టీవీ యాంకర్ పట్ల అసభ్యంగా మాట్లాడారు. ఈ విషయమై గేల్ క్షమాపణలు చెప్పడం, ఆమె క్షమించడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత మరో యువతి తనకు 2015లో జరిగిన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
డ్రెస్సింగ్ రూంలో తన ముందు టవల్ విప్పి దీని కోసమే చూస్తున్నావా అని దారుణంగా మాట్లాడాడని చెప్పింది. గతంలోను క్రిస్ గేల్ టీవి యాంకర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఫాక్స్ స్పోర్ట్స్ రిపోర్టర్ నీరోలీ మెడాస్ మాట్లాడుతూ... గేల్ తీరు గగుర్పాటు కలిగించేదిగా ఉంటుందని చెప్పింది. అతను ఎప్పుడూ అలాగే ప్రవర్తిస్తుండాని ఆరోపించింది.

2011లో ఓసారి ఇంటర్వ్యూ చేసిన సమయంలో 'నీ అందమైన ఫేస్‌తో నేను డిస్టర్బ్ అయ్యాను. మరోసారి నీవు అడిగిన ప్రశ్న అడగగలవా' అని వ్యాఖ్యానించాడని చెప్పింది.
నైన్ న్యూస్ రిపోర్టర్ యోన్నే శాంప్సన్ మాట్లాడుతూ... ఓసారి తన ఇంటర్వ్యూ చూసిన గేల్ తనతో డేటింగ్ చేస్తావా అని అడిగాడని చెప్పింది.
ట్విట్టర్ ద్వారా నేను గుర్తించానని, గేల్ తనతో డిన్నర్ చేయాలనుకున్నాడాని అర్థమైందని చెప్పింది. తాను గేల్‌ను ఎప్పుడూ కలవలేదని, క్రిస్ గేల్ వుమనైజర్ అని నేను భావిస్తున్నానని చెప్పింది. అతని తీరును బట్టి అలా అనవచ్చేమో అంది.