Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రీక్యాప్: గంగ్నమ్ డ్యాన్స్‌‌తో ఇరగదీసిన కోహ్లీ (వీడియో)

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ... వరల్డ్ కప్‌కు ఏ మాత్రం తీసిపోని అద్భుతమైన టోర్నీ. ఈ టోర్నీలో టాప్ 8 దేశాలు పాల్గొంటాయి. జూన్ 1 జరిగే ఈ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోంది. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.

Know ICC Champions Trophy 2013 winner

ఆతిథ్య ఇంగ్లాండ్‌తో పాటు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గ్రూప్ ఎ నుంచి పోటీ పడుతుండగా భారత్, పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా గ్రూప్‌ బి నుంచి ఢీకొంటున్నాయి. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్‌ను ఫైనల్‌లో ఓడించిన భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌‌గా బరిలోకి దిగుతుంది.

ఈ టోర్నీలో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జూన్ 4వ తేదీన మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు ఇది ఐదో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కావడం విశేషం.

ఇదిలా ఉంటే జూన్ 23, 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ని వర్షం కారణంగా 20 ఓవర్లకి కుదించారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 43), రవీంద్ర జడేజా (25 బంతుల్లో 33) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.

అనంతరం 130 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మోర్గాన్ (30 బంతుల్లో 33), రవి బొపారా (25 బంతుల్లో 30) దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్ 17.2 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేయడంతో అలవోకగా గెలిచేలా కనిపించింది.

ఈ సమయంలో వరుస బంతుల్లో మోర్గాన్, రవి బొపారాని అవుట్ చేసి పేసర్ ఇషాంత్ శర్మ మ్యాచ్‌ని భారత్‌వైపు తిప్పాడు. చివరికి ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ, జడేజా, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తదితరులు గంగ్నమ్ డ్యాన్స్‌లతో అదరగొట్టారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+