Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: కేఎల్ రాహుల్ ఔటా? నాటౌటా? - మాజీ క్రికెటర్లు ఏమన్నారంటే! (Video)

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కేఎల్ రాహుల్ ఔట్‌పై తీవ్రమైన చర్చ సాగుతోంది. కేఎల్ రాహుల్ ఔటా? నాటౌటా? అని మాజీ క్రికెటర్లు, అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మిచెల్ స్టార్క్ వేసిన బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ డిఫెన్స్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాటుకు తాకుతూ వెళ్లిందని ఆస్ట్రేలియా ప్లేయర్లు అపీలు చేశారు. కానీ ఫీల్డ్ అంపైర్లు ఔట్ ఇవ్వలేదు.

దీంతో ఆస్ట్రేలియా రివ్యూ కోరింది. థర్డ్ అంపైర్ స్నికో మీటర్ ఆధారంగా ఔట్‌ను పరిశీలించాడు. అయితే బ్యాటు సమీపం నుంచి బంతి వెళ్తున్న సమయంలోనే రాహుల్ బ్యాట్ తన ప్యాడ్లకు తాకింది. దీంతో స్నికోలో స్పైక్ చూపించింది. బ్యాటుకు బంతి తాకినందుకు అలా వచ్చిందా? లేదా ప్యాడ్లకు బ్యాటు తాకినందుకు స్నికో మీటర్ రీడింగ్ చూపించిందా? అనే విషయం గందరగోళంగా మారింది. కానీ థర్డ్ అంపైర్ ఫ్రంట్ వ్యూతో పరిశీలించి..బంతి దిశలో డిఫ్లెక్షన్ వచ్చిందని భావించి ఔట్‌గా ఇచ్చాడు.

KL Rahul s Dismissal Against Australia Sparks Outrage Ridiculous Umpiring and This is a Joke

ఈ ఆధారంగా థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంపై కేఎల్ రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిరాశగా మైదానం వైపు కదిలాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ 74 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేశాడు. అయితే థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చిన తీరుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.

కేఎల్ రాహుల్ ఔట్ అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు- సంజయ్ మంజ్రేకర్
ఇక్కడ కేఎల్ రాహుల్ దురదృష్టవంతుడు- వసీమ్ అక్రమ్
వాట్‌దా...అసలు ఇదేం నిర్ణయం? జోక్‌గా ఉందా? - రాబిన్ ఉతప్ప
ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి బలమైనా ఆధారం ఏమైనా ఉందా? బ్యాటు ప్యాడ్‌కు తాకిందని స్పష్టంగా కనిపించింది. అల్ట్రాఎడ్జ్‌లో టూ స్పెక్స్ ఎందుకు కనిపించలేదు? ఇది చెత్త నిర్ణయం- ఆకాశ్ చోప్రా

Story first published: Friday, November 22, 2024, 11:52 [IST]
Other articles published on Nov 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+