Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : గుడికెళ్లిన రాహుల్‌పై పేలుతున్న మీమ్స్.. కోహ్లీని కాపీ కొడుతున్నావా?

KL RahulFans go crazy over KL Rahul visiting Mahakaleshwar Temple

టీమిండియాలో అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్న ఆటగాడు కేఎల్ రాహుల్. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో అతను ఏడాది కాలంగా తేలిపోతున్నాడు. అంతకుముందు కూడా రాహుల్ రాణించిందేం లేదు. ఒక సెంచరీ కొడితే ఆ తర్వాత వరుసగా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడం అతనికి అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో సిరీస్‌ అతనికి చివరి అవకాశం అని చాలా మంది అనుకున్నారు. ఇప్పటికే ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టి, అతన్ని ఆడించడం పెద్ద సవాల్‌గా భావించారు.

ఇంకా ఎంత కాలం?

ఇంకా ఎంత కాలం?

కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం రాహుల్‌కు అండగా నిలిచింది. తొలి రెండు టెస్టుల్లో అతనికి అవకాశం ఇచ్చింది. ఈ మ్యాచుల్లో కూడా రాహుల్ దారుణంగా ఫెయిలయ్యాడు. దీంతో మూడో టెస్టులో రాహుల్‌ను పక్కన పెట్టేసి, శుభ్‌మన్ గిల్‌ను ఆడించాలని పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్‌లో ట్యాలెంట్ ఉన్నా, దానికి ఫలితం లేకపోతే ఎంత కాలం ఆడిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో టెస్టు కోసం ఇండోర్ చేరుకున్న రాహుల్.. భార్య అతియా శెట్టితో కలిసి జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాలేశ్వర్ ఆలయాన్ని సందర్శించాడు.

కోహ్లీని కాపీ కొట్టేస్తే?

కోహ్లీని కాపీ కొట్టేస్తే?

ఇక్కడ పూజలు చేసిన రాహుల్ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇవి చూసిన నెటిజన్లు రకరకాలుగా జోకులు పేలుస్తున్నారు. గతంలో కోహ్లీ కూడా ఫామ్ లేక తంటాలు పడుతుండగా.. స్పిరిచ్యువల్ టూర్స్ వేసిన సంగతి తెలిసిందే. నీమ్ కరోలీ బాబా ఆశ్రమానికి వెళ్లి వచ్చిన తర్వాత కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. వన్డేల్లో మూడు శతకాలు బాదాడు. ఇప్పుడు రాహుల్ కూడా కోహ్లీని కాపీ కొడుతున్నాడని, ఇలా గుడికెళ్లి వచ్చి ఇండోర్‌లో అదరగొట్టాలని ట్రై చేస్తున్నాడని నెట్టింట మీమ్స్ చేస్తున్నారు. ఇలా కోహ్లీని కాపీ కొట్టేసి మూడో టెస్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడని అంటున్నారు. మరికొందరేమో త్వరలో మొదలయ్యే ఐపీఎల్ కోసమే ఈ పూజలు అంటూ జోక్స్ వేస్తున్నారు.

మూడో టెస్టులో ఛాన్స్?

మూడో టెస్టులో ఛాన్స్?

మరి మూడో టెస్టులో అతన్నే ఆడిస్తారా? లేక గిల్‌కు అవకాశం ఇస్తారా? అని చూడాలి. ఒకవేళ రాహుల్‌ను ఆడించి, అతను కనుక మంచి స్కోరు చెయ్యకపోతే మాత్రం టీమిండియా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతేడాది కాలంలో రాహుల్ ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా చెయ్యలేదు. సౌతాఫ్రికాపై ఒక హాఫ్ సెంచరీ చేసిన తర్వాత మళ్లీ టెస్టుల్లో రాణించింది లేదు. ఆస్ట్రేలియాపై రెండు మ్యాచుల్లో మూడు ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసిన అతని అత్యుత్తమ స్కోరు 20 పరుగులు అంటేనే రాహుల్ ఫామ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Story first published: Sunday, February 26, 2023, 21:41 [IST]
Other articles published on Feb 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+