Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : టెస్టు సిరీస్‌లో ఫెయిలైతే.. రాహుల్ కెరీర్ ముగిసినట్లే?

KL Rahul will be dropped if he fails to impress in INDvsAUS series

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు కచ్చితంగా గెలవాలి. దీనికోసం టీమిండియా బ్యాటర్లంతా రాణించక తప్పదు. ఈ క్రమంలో అందరి ఫోకస్ టీమిండియా వెటరన్ బ్యాటర్లపై ఉంది. శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో అతన్నే ఓపెనర్‌గా పంపాలని కొందరు మాజీలు చెప్తున్నారు. అయితే కేఎల్ రాహుల్ ఉండగా గిల్‌కు ఈ ఛాన్స్ ఇవ్వడం కుదరదనే వాళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఈ టెస్టు సిరీస్ కేఎల్ రాహుల్ కెరీర్‌కు చాలా కీలకం కానుంది.
కుర్రాళ్ల నుంచి గట్టి పోటీ

కుర్రాళ్ల నుంచి గట్టి పోటీ

ప్రస్తుతం టీమిండియాలో ఒక్కో స్థానానికి ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు. ఓపెనర్‌గా రాహుల్ స్థానానికి గిల్ నుంచి గట్టి పోటీ ఉంది. ప్రస్తుతం గిల్ తన కెరీర్ పీక్స్‌లో ఉన్నాడు. గడిచిన రెండు నెలల్లోనే అతను మూడడు ఫార్మాట్లలో సెంచరీలు నమోదు చేయడం గమనార్హం. దీంతో చాలా మంది నిపుణులు కూడా రోహిత్ శర్మతో కలిసి గిల్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. కావాలంటే రాహుల్‌ను మిడిలార్డర్‌లో పంపాలని అంటున్నారు. కానీ తొలి టెస్టులో రాహుల్ ఓపెనర్‌గా రావడం గ్యారంటీ. అతను కనుక రాణించకపోతే మాత్రం గిల్‌కు ఈ స్థానం దక్కడం కూడా ఖాయమే.

నికలడ లేని ఆట..

నికలడ లేని ఆట..

ఇప్పటి వరకు రాహుల్ తన కెరీర్‌లో 45 టెస్టులు, 51 వన్డేలు, 71 టీ20లు ఆడాడు. ప్రస్తుతం ఉన్న జట్టులోని సీనియర్ ప్లేయర్లలో రాహుల్ ఒకడని అనడం అతిశయోక్తి కాదు. కానీ ఇప్పటి వరకు అతను జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. దీనికి ప్రధాన కారణం అతనిలో నిలకడ లేకపోవడమే. టెస్టు స్పెషలిస్టుగా జట్టులో అరంగేట్రం చేసిన రాహుల్.. ఈ ఫార్మాట్లో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అతని సగటు టెస్టుల్లో కేవలం 34.36 మాత్రమే. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసిన అతను.. ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో మాత్రం ఫెయిలయ్యాడు. ఆధార పడిన బ్యాటర్‌గా అభిమానులు, నిపుణులు ఎవరూ రాహుల్‌ను చూడటం లేదంటేనే అతను ఎంత నిలకడ లేకుండా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

రెండేళ్లుగా ఆటే లేదు..

రెండేళ్లుగా ఆటే లేదు..

గడిచిన రెండేళ్లో రాహుల్ ఫామ్ పూర్తిగా పోయింది. ప్రస్తుతం 30 ఏళ్ల రాహుల్.. చాలా చెత్తగా ఆడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో అతని ఆటతీరు వల్లనే భారత్ ఓడిందని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అతన్ని టీ20 జట్టు నుంచి సెలెక్టర్లు తప్పించారు. వన్డేల్లో వైస్ కెప్టెన్సీ నుంచి కూడా తీసేశారు. ఇది చూస్తేనే సెలెక్టర్లకు కూడా ఈ విషయంలో ఓపిక నశించిపోయిందని తెలిసిపోతోంది. సాధారణంగా ఆటగాళ్లు 30 ఏళ్ల వయసులో తమ కెరీర్ బెస్ట్ ఫామ్ అందుకుంటారు. కానీ రాహుల్‌లో ఆ లక్షణాలే కనిపించడం లేదు. దీంతో ఆస్ట్రేలియా సిరీస్‌లో కనుక ఫెయిలైతే.. రాహుల్‌‌ను ఈ ఫార్మాట్‌ నుంచి కూడా తప్పించినా ఆశ్చర్యం లేదు.

Story first published: Tuesday, February 7, 2023, 18:03 [IST]
Other articles published on Feb 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+