Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KL Rahul:ఒక్క మ్యాచ్..ఒక్క కెప్టెన్.. రికార్డులు మాత్రం కొల్లలు..!

KL Rahul Vs RCB: Here is the list of records this Punjab Captain had created with unbeaten 132 runs
KL Rahul List Of Records | Highest Score by a Captain, Wicketkeeper, An Indian

దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా గురువారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఇరగదీసింది. మ్యాచ్ మొత్తం వన్ సైడెడ్‌గానే జరిగింది. ఎక్కడా బెంగళూరు జట్టు పోటీ ఇవ్వలేక పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ బెంగళూరు బౌలర్లను చీల్చి చెండాడాడు.

కేఎల్ రాహుల్‌కు బంతి వేయాలంటే కచ్చితంగా బెంగళూరు బౌలర్లకు వణుకు పుట్టి ఉంటుంది. ఎందుకంటే బంతి పడగానే అది బౌండరీకి వెళుతుండటంతో బౌలర్ల పరిస్థితి ఏంటో వారికే అర్థం కాలేదు. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ పలు రికార్డులను క్రియేట్ చేశాడు. కొన్ని రికార్డులను చెరిపేశాడు.

 కేఎల్ రాహుల్ రికార్డులు

కేఎల్ రాహుల్ రికార్డులు

కేఎల్ రాహుల్... కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్. ముందుండి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. బ్యాటింగ్‌లో సత్తాచాటాడు. 36 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసిన రాహుల్ ఆ తర్వాత కూడా వీరవిహారం కొనసాగించి సెంచరీ చేశాడు. సెంచరీ తర్వాత తాను ఎదుర్కొన్న 7 బంతుల్లో 32 పరుగులు పిండుకున్నాడు. దీంతో మొత్తంగా 69 బంతుల్లో 132 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక రాహుల్ స్వతహాగా పలు రికార్డులు నెలకొల్పాడు.

కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, భారతీయుడిగా..

కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, భారతీయుడిగా..

ఇక ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు (132 పరుగులు)చేసిన ఒక కెప్టెన్‌గా, ఒక వికెట్ కీపర్‌గా ఒక భారతీయుడిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఆ రికార్డు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ (128 పరుగులు) పేరిట ఉండేది. ఈ ఫీట్‌ను 2018 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై రిషబ్ సాధిచాడు. ఇక 2011లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్ (119 పరుగులు) డెక్కన్ ఛార్జర్స్ పై చేశాడు.

 రెండు వేర్వేరు దేశాల్లో సెంచరీలు

రెండు వేర్వేరు దేశాల్లో సెంచరీలు

టీట్వంటీ ఫార్మాట్‌లో 132 పరుగులు చేసిన కీపర్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు కీపర్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ (113 పరుగులు ) పేరిట ఉండేది. ఈ ఫీట్‌ను 2018-19లో మణిపూర్‌పై జరిగిన ఎస్ఎమ్ఏ T20 టోర్నమెంటులో సాధించాడు. రెండు వేర్వేరు దేశాల్లో జరిగిన ఐపీఎల్‌లో రెండు సెంచరీలు చేసిన రెండవ ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. 2019లో భారత్‌లో జరిగిన ఐపీఎల్‌లో తొలి సెంచరీ చేసిన రాహుల్.. దుబాయ్‌లో తన రెండో సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు ఏబీ డెవీలియర్స్ 2009వ సీజన్ ఐపీఎల్‌లో దక్షిణాఫ్రికాలో ఒక సెంచరీ చేయగా.. 2015 మరియు 2016లో భారత్‌లో జరిగిన ఐపీఎల్‌లో రెండు సెంచరీలు చేశాడు.

 వారి సరసన నిలిచిన కేఎల్ఆర్

వారి సరసన నిలిచిన కేఎల్ఆర్

132 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రెండవ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రాహుల్. అంతకుముందు పాక్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ 2017లో జరిగిన నేషనల్ టీ 20 కప్‌లో లాహోర్ వైట్స్ తరపున ఆడి 150 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఇప్పటి వరకు కేఎల్ రాహుల్ టీట్వంటీ ఫార్మాట్‌లో 4 సెంచరీలు చేసి రోహిత్ శర్మ (6) , విరాట్ కోహ్లీ (5) సురేష్ రైనా (4) సరసన నిలిచాడు.ఇక సెంచరీలు చేసిన వికెట్ కీపర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వృద్ధిమాన్ సాహా సరసన మరో వికెట్ కీపర్‌గా నిలిచాడు కేఎల్ రాహుల్. టీట్వంటీ ఫార్మాట్‌లలో నాలుగు వేర్వేరు దేశాల్లో సెంచరీలు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ రికార్డు క్రియేట్ చేశాడు. అంతకుముందు క్రిస్ గేల్ ఏడే వేర్వేరు దేశాల్లో సెంచరీ చేయగా.. బ్రెండన్ మెకల్లమ్ మరియు కెమెరూన్ డెల్‌పోర్ట్‌లు నాలుగు వేర్వేరు దేశాల్లో సెంచరీలు చేశారు. 60 ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసి మరో రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ పేరిట ఈ రికార్డు ఉండేది.

 కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు

కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు

టీట్వంటీలో 132 పరుగులు చేసిన రెండో భారతీయుడిగా మరో రికార్డు క్రియేట్ చేశాడు.అంతకుముందు శ్రేయాస్ అయ్యర్ 2019లో ముంబై తరపున సిక్కింపై 147 పరుగులు చేశాడు. ఇక టీట్వంటీ ఫార్మాట్‌లో చేసిన కేఎల్ రాహుల్ 132 పరుగులు ఒక కెప్టెన్ సాధించిన నాల్గవ అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.అంతకుముందు శ్రీలంక దేశవాళీ టీ20లో ఆదేశ ఆటగాడు తసున్ శనకా చేసిన 131 పరుగులు ఉన్నాయి. మొత్తానికి ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజెర్స్ తరపున ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్ మరెన్నో రికార్డులను కూడా చెరిపివేశాడు.

Story first published: Friday, September 25, 2020, 12:45 [IST]
Other articles published on Sep 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+