KL Rahul: ఓనర్ పేరు ప్రస్తావించకుండానే ట్వీట్ చేసిన కేఎల్ రాహుల్..
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పోస్ట్ చేశాడు. కేఎల్ రాహుల్ 2022 నుంచి 2024 వరకు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా వ్యవహరించాడు. కానీ ఈసారి వేలంలోకి వచ్చిన అతను ఢిల్లీకి వెళ్లాడు. రాబోయే సీజన్ కోసం DCలో చేరిన తర్వాత ఎక్స్ లో ట్వీట్ చేశాడు. కోచ్‌లు, సహచరులు, లక్నో ఆధారిత ఫ్రాంచైజీ అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. అయితే ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా పేరును అతను ప్రస్తావించలేదు.
"LSGతో ఈ ప్రయాణాన్ని మరువలేనిదిగా చేసిన కోచ్‌లు, సహచరులు, అభిమానులకు కృతజ్ఞతలు. నమ్మకం, జ్ఞాపకాలు, శక్తి, తిరుగులేని మద్దతు ఇచ్చిన వాిరకి ధన్యవాదాలు✌️" అని పేర్కొన్నాడు. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పేరును ప్రస్తావించలేదు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. ఐపీఎల్ 2024 సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన డూ-ఆర్-డై పోరులో ఎల్ఎస్జీ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో కెప్టెన్ రాహుల్ ను యజమాని సంజీవ్ గోయెంకా బహిరంగంగా దూషించాడు.

ఆ మ్యాచ్ లో ప్యాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఎస్ఆర్జెచ్ 10 ఓవర్లలో 66 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అందుకే రాహుల్ జట్టులో ఉండేందుకు ఇష్టపడలేదని ప్రచారం జరిగింది. అలాగే జట్టు యాజమాన్యానికి కూడా రాహుల్ ఉంచుకోవడం ఇష్టంలేక రిటైన్ చేసుకోలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కాగా కేఎల్ రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ (DC) అతనిని రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) మధ్య జరిగిన బిడ్డింగ్ వార్ జరిగింది. చివరికి ఢిల్లీ కొనుగోలు చేసింది.
ఎల్‌ఎస్‌జీ ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే రాహుల్ దూషించడంపై లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా స్పందించారు. "సరే, నేను మీమ్‌ని చూడలేదు, కానీ నేను ఇంత చెప్పగలను. బాస్ ప్రేమగలవాడు, శ్రద్ధగలవాడు. అవును, కఠినమైనవాడు కూడా. ప్రేమ అవసరమైనప్పుడు, అతను ప్రేమను ఇస్తాడు, సంరక్షణ అవసరమైనప్పుడు శ్రద్ధ చూపుతాడు. కొంచెం తిట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు తిడతాడు" అని గోయెంకా వివరించాడు.
Grateful to the coaches, teammates and the fans who made this journey with LSG unforgettable. Thank you for the trust, memories, energy and unwavering support. Here’s to new beginnings! ✌️ pic.twitter.com/Vz5XFeDjwV
— K L Rahul (@klrahul) November 27, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications