న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కేఎల్ రాహుల్ క్రికెటరే కాదు.. జట్టులోంచి తీసేయండి'

India Vs Australia XI 2018 : KL Rahul Trolled For Yet Another Failure With The Willow | Oneindia
KL Rahul trolled for yet another failure with the willow

సిడ్నీ: టెస్టు ఫార్మాట్‌కు ముందు సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. గురువారం ఆరంభమైన వార్మప్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 92 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌటైంది. 4 రోజుల వార్మప్ మ్యాచ్‌‌లో వర్షం కారణంగా బుధవారం తొలిరోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో భారత్ టాపార్డర్ పరుగుల మోత మోగించారు.

మ్యాచ్‌లోనూ అదే తరహాలో అవుటై

మ్యాచ్‌లోనూ అదే తరహాలో అవుటై

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టు కెప్టెన్ శామ్ వైట్‌మాన్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇటీవల ఆసీస్‌పై టీ20 సిరీస్‌లో ఘోరంగా విఫలమైన కేఎల్ రాహుల్.. పృథ్వీ షా‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఈ మ్యాచ్‌లోనూ అదే తరహాలో అవుటై ఐదో ఓవర్‌లోనే రాహుల్ (3) పెవిలియన్ చేరుకున్నాడు.

2 మ్యాచ్‌లు ఆడి 27 పరుగులు మాత్రమే

పేలవమైన ఫామ్‌తో కొనసాగుతున్న రాహుల్ కొన్ని సీజన్లుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు మరోసారి తీవ్ర నిరాశను మిగిల్చాడు. ఇటీవలే ముగిసిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రాహుల్ కేవలం 2 మ్యాచ్‌లు ఆడి 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతనిపై ఎంతో నమ్మకముంచుకుని టెస్టు జట్టులో చోటు కల్పించిన సెలక్టర్లకు రాహుల్ ఎంతవరకూ న్యాయం చేయగలడో డిసెంబర్ 6 అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చూడాలి.

జట్టులోకి ఎందుకు తీసుకున్నారు.

ఇదిలా ఉంటే వార్మప్ మ్యాచ్ స్కోరును బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ వేదికగా అప్‌డేట్ ఇస్తోంది. కేఎల్ రాహుల్ 3 పరుగులకే అవుట్ అయ్యాడంటూ చేసిన ట్వీట్‌పై నెటిజన్లకు విరుచుకుపడ్డారు. 'అతను క్రికెటర్‌యే కాదు. అసలు జట్టులోకి ఎందుకు తీసుకున్నారు. 'దయచేసి జట్టులోంచి తీసేయండి. భవిష్యత్ సూపర్ స్టార్ పృథ్వీ షా.. కేఎల్ రాహుల్ కంటే మెరుగ్గా ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ ఔటవడంలో ఆశ్చర్యమేమి లేదు.

Story first published: Thursday, November 29, 2018, 14:41 [IST]
Other articles published on Nov 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X