Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధావన్ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్: గణాంకాలు ఏం చెబుతున్నాయి!

KL Rahul Stats and Records: Who Can Replace Injured Shikhar Dhawan as Opener in ICC Cricket World Cup 2019

హైదరాబాద్: గాయం కారణంగా ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌కు శిఖర్ ధావన్ మూడు వారాల పాటు దూరం కావడంతో అతడి స్థానంలో రోహిత్ శ‌ర్మ‌తో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బ‌రిలో దిగ‌నున్నాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ శిఖర్ ధావన్‌కు జట్టు యాజమాన్యం మంగళవారం స్కానింగ్‌ చేయించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో అతడి వేలి ఎముక చిట్లినట్టు తేలింది. గాయం తీవ్రత దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అతడు సుమారు మూడు వారాల పాటు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టోర్నీలో భాగంగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ పేరు తెరపైకి రావడంతో వన్డేల్లో అతడి రికార్డుల గురించి చర్చించుకుంటున్నారు. భారత్ తరుపున ఇప్పటివరకు 16 వన్డేలాడిన కేఎల్ రాహుల్ 380 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఈ సెంచరీని కేఎల్ రాహుల్ తన తొలి నాళ్లలో నమోదు చేశాడు. వరల్డ్‌కప్‌లో ప్రస్తుతం రాహుల్ నాలుగో స్థానంలో ఆడుతున్నాడు.

ఇంగ్లీషు పరిస్థితులపై కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న 12వ ఎడిషన్ వన్డే వరల్డ్‌కప్‌లో కేఎల్ రాహుల్ సఫారీలతో ఆడిన తొలి మ్యాచ్‌లో 3 బంతుల్లో 11 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 42 బంతుల్లో 26 పరుగులు చేశాడు.

అయితే, వన్డేల్లో శిఖర్ ధావన్-రోహిత్ శర్మల జోడీ ఓపెనర్లుగా అత్యంత విజయవంతమైన జోడీగా పేరుగాంచింది. గాయం కారణంగా ధావన్ మ్యాచ్‌లకు దూరం కావడంతో అతడి స్థానాన్ని ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ భర్తీ చేయనున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ ఎలాంటి మద్దతిస్తాడో చూడాలి మరి.

Story first published: Tuesday, June 11, 2019, 15:44 [IST]
Other articles published on Jun 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+