Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs GT: 14 ఫోర్లతో, 4 సిక్సర్లతో కేఎల్ రాహుల్ ఊచకోత

DC vs GT: ఐపీఎల్ 2025లో భాగంగా 60వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ కీలకమైన మ్యాచ్‌‌లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో ఢిల్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 112, అభిషేక్ పోరెల్ 30, అక్షర్ పటేల్ 25, ట్రిస్టన్ స్టబ్స్ 21 పరుగులతో రాణించారు. ఫాఫ్ డుప్లెసిస్ 5 పరుగులకే ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ తలో వికెట్ పడగొట్టారు.

అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనింగ్ బాధ్యతను కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. ఢిల్లీ జట్టుకు ఓపెనర్‌గా రాహుల్ బలమైన ఆరంభాన్ని అందించాడు. మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఐపీఎల్ కెరీర్‌లో రాహుల్‌కు ఇది ఐదో సెంచరీ. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కేవలం 60 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 14 ఫోర్లతో, 4 సిక్సర్లతో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. గుజరాత్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.

KL Rahul Smashes 5th IPL Century with 14 Fours and 4 Sixes Against GT DC Posts 199 3

ఐదో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఐదో సెంచరీని సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో కేఎల్ రాహుల్ నాల్గవ స్థానానికి చేరుకున్నాడు. ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ కంటే విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్, క్రిస్ గేల్ మాత్రమే ఎక్కువ సెంచరీలు చేశారు. కేఎల్ రాహుల్ గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తరఫున కూడా సెంచరీలు చేశాడు.

ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
8 సెంచరీలు - విరాట్ కోహ్లీ
7 సెంచరీలు - జోస్ బట్లర్
6 సెంచరీలు - క్రిస్ గేల్
5 సెంచరీలు - కేఎల్ రాహుల్

Story first published: Sunday, May 18, 2025, 21:45 [IST]
Other articles published on May 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+