శతకంతో చెలరేగిన రాహుల్: విండీస్‌పై 162 పరుగుల ఆధిక్యం
కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి రోజు భారత బౌలర్లు అద్భుతంగా రాణించగా.. రెండో రోజు బ్యాట్స్‌మెన్లు తమదైన శైలిలో చెలరేగిపోయారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 158 (303 బంతుల్లో 15x4, 3x6) భారీ శతకంతో చెలరేగడంతో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 358/5 పరుగులు చేసింది.
ప్రస్తుతం రహానె (42), సాహా (17) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 126/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్లు రాహుల్, ఛటేశ్వర పుజారా విండీస్ బౌలర్లతో ఆడుకున్నారు . వికెట్లు కాపాడుకుంటూనే వన్డే తరహాలో దూకుడుగా ఆడారు. లంచ్ విరామానికి ముందే ఓపెనర్ రాహుల్ సెంచరీ పూర్తి చేశాడు.
విరామం తర్వాత పుజారా (46) రనౌట్‌గా వెనుదిరిగాడు. వీళ్లిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దూకుడుగా ఆడుతున్న రాహుల్‌కు కోహ్లీ తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. స్థిరంగా ఆడుతున్న రాహుల్.. గాబ్రియల్ బౌలింగ్‌లో డౌరిచ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రహానె, కోహ్లీతో కలిసి మరోసారి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు. అయితే కోహ్లి (44) చేజ్ బౌలింగ్‌లో రాజేంద్ర చంద్రికకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్(3) నిరాశ పరిచాడు. బిషూ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో ఔటయ్యాడు.
దీంతో భారీ స్కోరు దిశగా పయనిస్తున్న భారత్‌ను విండీస్ బౌలర్లు కొంత వరకు కట్టడి చేయగలిగారు. రహానె, సాహా ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 162 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. విండీస్ బౌలర్లలో చేజ్ రెండు వికెట్లు తీయగా.. గాబ్రియల్, బిషూ చెరో వికెట్ తీశారు. అంతకుముందు భారత బౌలర్లు 196 పరుగులకే విండీస్‌ను ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఈ టెస్టులో సెంచరీ చేయడం ద్వారా కెఎల్ రాహుల్.. ఒకే ఏడాదిలో రెండు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆటగాడిగా తన పేరు నమోదు చేసుకున్నాడు. అది కూడా ఏడాదిలోనే కావడం విశేషం. 2016లోనే టెస్ట్, వన్డే రాహుల్ సెంచరీ చేశాడు. అంతేగాక, సిక్స్‌తో సెంచరీ పూర్తి చేయడం విశేషం. అంతకుముందు 2013లో రోహిత్ శర్మ ఇలా సిక్స్ తో సెంచరీ పూర్తి చేశాడు.
తక్కువ ఇన్నింగ్స్‌ల్లో మూడో టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాళ్లు
4 మ్యాచ్ ల్లో మహ్మద్ అజహరుద్దీన్ (ఆల్ టైమ్ టెస్ట్ రికార్డ్)
6 మ్యాచ్ ల్లో వినోద్ కాంబ్లీ
7 మ్యాచ్ ల్లో సునీల్ గవాస్కర్
11 మ్యాచ్ ల్లో ఛటేశ్వర్ పుజారా/కెఎల్ రాహుల్

పుజారా రనౌట్
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి రోజు భారత బౌలర్లు అద్భుతంగా రాణించగా.. రెండో రోజు బ్యాట్స్‌మెన్లు తమదైన శైలిలో చెలరేగిపోయారు.

కెఎల్ రాహుల్ సెంచరీ
ఓపెనర్ కేఎల్ రాహుల్ 158 (303 బంతుల్లో 15x4, 3x6) భారీ శతకంతో చెలరేగడంతో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 358/5 పరుగులు చేసింది.

కెఎల్ రాహుల్
ప్రస్తుతం రహానె (42), సాహా (17) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్ స్కోరు 126/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్లు రాహుల్, ఛటేశ్వర పుజారా విండీస్ బౌలర్లతో ఆడుకున్నారు .

షాట్ కొడుతున్న రాహుల్
వికెట్లు కాపాడుకుంటూనే వన్డే తరహాలో దూకుడుగా ఆడారు. లంచ్ విరామానికి ముందే ఓపెనర్ రాహుల్ సెంచరీ పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications