ఆసియాకప్ ముందు కేఎల్ రాహుల్‌కు సంకటం.. ఎంట్రీ దక్కాలంటే కచ్చితంగా..?

ఆసియాకప్ టోర్నీలో పాల్గొనబోయే టీమిండియాకు కేఎల్ రాహుల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఆగస్టు 28న పాకిస్థాన్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో తన రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ టోర్నీకి టీమిండియా వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇకపోతే వెస్టిండీస్ పర్యటనలోని టీ20 సిరీస్‌కు అతను ఎంపిక కావాల్సింది. కానీ కరోనా కారణంగా అతను వెళ్లలేకపోయాడు. తాజాగా అతను జింబాబ్వే పర్యటనకు కూడా జట్టుకు ఎంపిక కాలేదు. అతను పూర్తి ఫిట్ నెస్ సాధించేవరకు అతన్ని టీమిండియా మేనేజ్ మెంట్ ప్రయోగించాలనుకోవట్లేదు. అయితే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ టోర్నీ నాటికి రాహుల్ పూర్తిగా ఫిట్ నెస్ సాధిస్తాడని టీం మేనేజ్ మెంట్ భావించి అతన్ని ఎంపిక చేసింది. ఐపీఎల్ 2022 తర్వాత తొలిసారిగా రాహుల్ గ్రౌండ్లోకి దిగబోతున్నాడు.

ఉత్తీర్ణత సాధిస్తేనే ఎంట్రీ
ఆసియా కప్ 2022 కోసం యూఏఈకి వెళ్లే ముందు రాహుల్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రాహుల్ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ పరీక్ష ఎదుర్కోనున్నాడు. అతను ఈ ఫిట్ నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే టీంలో ఎంపికై రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. ఇక రాహుల్ విండీస్‌కు బయలుదేరడానికి ముందు కూడా నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండి చికిత్స అలాగే ఫిట్ నెస్ కసరత్తులు చేశాడు. దాదాపు ఫిట్ నెస్ సాధించినట్లే కన్పించాడు. మరో 12గంటల్లో విండీస్ టూర్‌కు వెళ్లబోతున్నాడు అనే టైంలో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మళ్లీ తన ఫిట్ నెస్ మొదటికొచ్చింది. ఐసోలేషన్ నిబంధనల కారణంగా కొన్ని రోజులు ప్రాక్టీస్‌కు దూరమయ్యాడు.

వరుసగా సిరీస్లకు దూరం
2022లో ఫిట్ నెస్, గాయాల కారణంగా రాహుల్ చాలా సిరీస్‌లకు దూరమయ్యాడు. ఐపీఎల్ తర్వాత అతను దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ మ్యాచ్‌కు ముందు అతను గజ్జల్లో గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక ఆపరేషన్ కోసం జర్మనీకి వెళ్లాడు. సౌతాఫ్రికా సిరీస్ తర్వాత అతను ఐర్లాండ్, ఇంగ్లాండ్, విండీస్ పర్యటనలకు దూరమయ్యాడు. ఇన్ని సిరీస్లకు దూరమైనప్పటికీ.. అతను జట్టుకు అందుబాటులో ఉంటే అతను ప్లేయింగ్ XIలో కచ్చితంగా ఉంటాడు. అందువల్ల ఆసియాకప్ టోర్నీకి ముందు ఇక ఫిట్‌నెస్ టెస్ట్‌ను ఎలా ఎదుర్కుంటాడనేది ఆసక్తికరంగా మారింది.


ఆసియాకప్‌కు ఎంపికైన భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవిబిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్.
స్టాండ్ బై ప్లేయర్లు : శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ , దీపక్ చాహర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications