For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: రోహిత్ వస్తే తప్పుకోవాల్సింది రాహులే.. తేల్చేసిన మాజీ లెజెండ్!

 KL Rahul should go if rohit comes says former legend

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది కెప్టెన్ కేఎల్ రాహులే. ఓపెనర్‌గా బరిలో దిగిన అతను.. తొలి టెస్టులో విఫలమయ్యాడు. రెండో టెస్టులో అయినా రాణిస్తాడని అనుకుంటే ఆ మ్యాచ్‌లో మరింత దారుణంగా ఫెయిలయ్యాడు. దీంతో అతనిపై అభిమానులు మండి పడుతున్నారు. ఇలాంటి సమయంలో రాహుల్ కెరీర్‌పై మాజీ లెజెండ్ వసీం జాఫర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

తప్పుకోక తప్పదు..

తప్పుకోక తప్పదు..

బొటన వేలి గాయంతో బంగ్లా టెస్టు సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు మ్యాచుల్లో జట్టుకు రాహుల్ నాయకత్వం వహించాడు. మళ్లీ శ్రీలంకతో టెస్టు సిరీస్ నాటికి రోహిత్ కోలుకుంటాడని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. దీంతో రోహిత్ వస్తే యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెడతారని అనుకుంటూ వచ్చారు. కానీ అతను తొలి టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. అలాంటి ఆటగాడిని పక్కన పెట్టడం తగదని జాఫర్ అభిప్రాయపడ్డాడు.

ఈ ఏడాది అంతా అంతే..

ఈ ఏడాది అంతా అంతే..

ఈ ఏడాదిలో కేఎల్ రాహుల్ తన బ్యాటుతో ఏమాత్రం ఆకట్టుకోలేదు. టీ20 వరల్డ్ కప్ వంటి అతి పెద్ద వేదికపై సెమీఫైనల్‌లో అత్యంత నెమ్మదైన బ్యాటింగ్‌తో జట్టుకు భారంగా మారాడు. ఇప్పుడు టెస్టుల్లో కూడా పెద్దగా రాణించడం లేదు. బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో 22, 23 పరుగులు చేసిన రాహుల్.. రెండో మ్యాచులో 10, 2 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాదిలో మొత్తం నాలుగు టెస్టు మ్యాచులు ఆడిన అతను కేవలం 17.13 సగటుతో 137 పరుగులు సాధించాడు.

అదేం ఆటతీరు?

అదేం ఆటతీరు?

రెండో టెస్టులో భారత జట్టు ఆట తీరును కూడా వసీం జాఫర్ తప్పుబట్టాడు. టీమిండియా మరీ ఆత్మరక్షణలో ఆడిందన్నాడు. 'తొలి ఇన్నింగ్స్‌లో గిల్ తన షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే చేస్తాడని అనుకున్నా. లక్ష్యం తక్కువ కాబట్టి మరింత ఎగ్రెసివ్‌గా ఆడతాడని భావించా. కానీ అలా జరగలేదు. డిఫెన్సివ్‌గా ఆడితే పరుగులు అంత ఈజీగా రావు. స్పిన్నర్లదే పైచేయి అవుతుంది. అసలు టీమిండియా ఆటతీరు అంత డిఫెన్సివ్‌గా ఎందుకు ఉందో అర్థం కాలేదు' అని జాఫర్ అన్నాడు.

Story first published: Sunday, December 25, 2022, 18:24 [IST]
Other articles published on Dec 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+